బెంగళూరు వెలుపల ఉన్న అనేకల్ ప్రాంతంలో ఓ మహిళతో జరిగిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె స్కానింగ్ కోసం స్థానిక రేడియాలజిస్ట్‌ను సంప్రదించగా, చికిత్స పేరుతో ఆ డాక్టర్ ఆమెను లైంగికంగా వేధించినట్టు తెలిసింది. వైద్యం చేయాల్సిన వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించడమే కాక బెదిరింపులకు కూడా దిగాడు.
Read Also: Delhi blast: క్లాస్ లో తాలిబన్ రూల్స్ పాటించే ఉమర్ బాగోతం
మహిళ వివరాల ప్రకారం
మహిళ వివరాల ప్రకారం స్కానింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే డాక్టర్ ఆమె చేతిపై అనవసరంగా తాకడం ప్రారంభించాడు. తరువాత పరిస్థితిని తప్పుదోవ పట్టిస్తూ ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ను టచ్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మహిళ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, “దీనిని ఎవరికైనా చెబితే ప్రాణాలే తీస్తాను” అంటూ బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
డాక్టర్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితురాలు ఆ సంఘటనను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి ఉంచింది. ఈ వీడియో ఆధారంగా ఆమె పోలీసులకు చేరుకొని అధికారికంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు అయినప్పటికీ, పోలీసులు రేడియాలజిస్ట్‌ను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పోలీసులు విచారణ జరిపి వదిలేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: