📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News Telugu: voilence: లద్దాఖ్ హింసాత్మక నిరసనలు- నలుగురు మృతి

Author Icon By Rajitha
Updated: September 25, 2025 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర పాలిత ప్రాంత లద్దాఖ్ Ladakh కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు చనిపోయారు. 30మంది పోలీసులు సహా 59మంది గాయపడ్డారు. voilence లేహ్లో హింస అనంతరం, 15 రోజులుగా తాను చేపట్టిన నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు సామాజిక కార్యకర్త సోనమ్ వాంచుగ్ ప్రకటించారు. లద్దాఖ్ కు పూర్తిస్థాయి రాష్ట్రహోదా ఇవ్వాలని, ఆరో షెడ్యూల్ పొడిగించాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. అయితే నిన్న జరిగిన హంసకు సోనమ్ వాంగ్ చుక్ Sonam Wang Chuk కారణమని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రహోదా, ఆరో షెడ్యూల్ పొడిగింపుపై జరుగుతున్న చర్చలపై అసంతృప్తితో ఉన్న కొంతమంది వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ ప్రకటనలో కేంద్రం పేర్కొంది.

RRB NTPC Railway Jobs 2025 : 8,875 రైల్వే పోస్టుల నోటిఫికేషన్, అర్హతలు & వివరాలు

ఈ అంశాలపై అక్టోబరు 6న జరగాల్సిన హైపవర్ కమిటీ సమావేశాన్ని సెప్టెంబరు 25, 26న నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది. కొంతమంది స్వార్థ రాజకీయాలు, సోనమ్ వాంగ్లుక్ వ్యక్తిగత లక్ష్యాల వల్ల లద్దాఖ్ యువత భారీ మూల్యం చెల్లిస్తున్నారు’ అని హోంమంత్రిత్వశాఖ తన ప్రకటనలో పేర్కొంది. లేహ్ జిల్లాలో కర్న్యూ విధించినట్లు లద్దాఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా తెలిపారు. తమ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారని, లేహ్ లో పరిస్థితి ఉద్రికత్తంగా ఉందన లద్దాఖ్ బీజేపీ అధ్యక్షుడు తాగి గ్యాల్సన్ ఖాచు చెప్పారు. అసలు హింస ఎందుకు జరిగింది? ఈనెల 10 నుంచి నిరాహార దీక్ష చేస్తున్న 15మందిలో ఇద్దరి పరిస్థితి మంగళవారం సాయంత్రం క్షీణించడంతో లద్దాఖ్ అపెక్స్ బాడీ యువజన విభాగం బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో బుధవారం (నిన్న) ఉదయం లద్దాఖ్ రాజధాని లేహ్ వీధుల్లోకి వందలమంది వచ్చారు. మధ్యాహ్నం నుంచి హింసాత్మక ఘటనలు జరిగాయి.

voilence

లద్దాఫ్ నుంచి వచ్చింది

లేహ్ లోని బీజేపీ BJP కార్యాలయానికి నిప్పటించారు. కొన్ని పోలీసు, సీఆర్పీఎఫ్ CRPF వాహనాలను తగలబెట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. నిరాహార దీక్ష స్థలంలో, రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు ఫుంట్సోగ్ స్టాన్జిన్ పై కేసు నమోదు చేశారు. కేంద్రంపై పలువురు విమర్శలు లేహ్ లో నిరసనలపై కేంద్ర ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్త కోరారు. 2019 నుంచి ఏం మారిందో భారత్ ప్రభుత్వం నిజాయితీగా పరిశీలన చేసుకోవాలి. voilence ఈ వీడియో అశాంతికి కేంద్రంగా భావించే కశ్మీర్ లోయ నుంచి కాదు, కోపంతో ఉన్న నిరసనకారులు పోలీసులు వాహనాలను, బీజేపీ కార్యాలయానికి నిప్పంటించిన లద్దాఫ్ నుంచి వచ్చింది’ అని ఆమె ఎక్స్లో పోస్టు పెట్టారు. ‘లద్దాఫ్ కు రాష్ట్ర హోదా హామీ కూడా ఇవ్వలేదు. 2019లో కేంద్ర పాలితహోదా పొందినప్పుడు వేడుక చేసుకున్నారు. అయితే, తమను మోసం చేశారనే కోపంతో ఉన్నారు’ అని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు.

లద్దాఖ్ లో హింసాత్మక నిరసనలు ఎందుకు జరిగాయి?
లద్దాఖ్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఆరో షెడ్యూల్ పొడిగించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి.

ఈ నిరసనల్లో ఎంతమంది మృతి చెందారు?
ఈ ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News hunger strike Ladakh protests latest news police clash Sonam Wangchuk Statehood Demand Telugu News violent clashes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.