ఇటీవల దుర్గా మాత నిమజ్జన సందర్భంగా రెండు వర్గాలు మధ్య ఘర్షణలు జరిగిన తర్వాత ఒడిశా(Odisha)లోని కటక్(Cuttack)లో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆదివారం బైక్ ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో పోలీసులు, ఓ సంస్థ సభ్యులు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో 25మంది గాయపడ్డారు. వారిలో ఎనిమిది మంది పోలీసులు ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, 36 గంటలపాటు కర్ఫ్యూ విధించింది.
CM: బ్రాహ్మణులే జ్ఞానవంతులంటూ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖిలారి రిషికేశ్ సహా పలువురికి గాయాలు
శనివారం తెల్లవారుజామున కటక్‌లోని దుర్గా బజార్ ప్రాంతంలో నిమజ్జన ఊరేగింపు సమయంలో మొదటిసారిగా హింస చెలరేగింది. అర్ధరాత్రి వేళ పెద్ద శబ్దంతో పాటలు పెట్టడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఊరేగింపులో పాల్గొన్న వారు ప్రతిఘటించడంతో హింస చెలరేగింది. ఈ గందరగోళంలో కటక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖిలారి రిషికేశ్ సహా పలువురు గాయపడ్డారు. ఆ తర్వాత పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కటక్ నగరంలో ఆంక్షలు విధించారు. ఆ తర్వాత హిందూ పరిషత్ సంస్థ ఆదివారం సాయంత్రం బైక్ ర్యాలీ నిర్వహించడంతో మళ్లీ ఉద్రికత్త పరిస్థితులు తలెత్తాయి.
బైక్ ర్యాలీకి అనుమతి నిరాకరిచడంతో ఈ ఘర్షణలు
బైక్ ర్యాలీకి అనుమతి నిరాకరిచడంతో ఈ ఘర్షణలు తలెత్తినట్లు కటక్ పోలీస్ కమిషనర్ సురేశ్ దేవదత్త సింగ్ తెలిపారు. ‘ఆదివారం కటక్‌లో బైక్ ర్యాలీకి హిందూ పరిషత్ సంస్థ అనుమతి కోరింది. కానీ మతపరమైన ఉద్రికత్తలు తలెత్తే ప్రమాదం కారణంగా అనుమతి ఇవ్వలేదు. అయినా ఆ సంస్థ ర్యాలీకి రావడం వల్ల భద్రతా సిబ్బంది వారికి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆ సంస్థ సభ్యులు ఘర్షణలకు దిగారు. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. అంతేకాకుండా పలు వాహనాలకు నిప్పంటించారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించి వారిని చెదరగొట్టారు. ఈ దాడిలో ఎనిమిది మంది పోలీసులతో సహా 25 మంది గాయపడ్డారు. శనివారం దుర్గామాత నిమజ్జన సమయంలో జరిగిన రాళ్ల దాడిలో ఎవరూ మరణించలేదు. నలుగురు గాయపడగా, ముగ్గురిని అదే రోజు డిశ్చార్జ్ చేశారు. ఒకరు మాత్రమే ఇంకా చికిత్స పొందుతున్నారు. ప్రాణాలు కోల్పోయారు అనేవి తప్పుడు వార్తలే. వాటిని వ్యాప్తి చేసే వారిపై చర్య తీసుకుంటాం’ అని సురేశ్ దేవదత్త సింగ్ పేర్కొన్నారు.
24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు బంద్
ఈ ఘర్షణలు కారణంగా 13 ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ‘ఆదివారం సాయంత్రం ఘర్షలు జరగడం వల్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేశాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఆదివారం సాయంత్రం సమయంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కూడా గాయపడ్డారు. అందుకే నగరంలో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశాం. తక్షణమే కర్ఫ్యూ అమలు చేశాం. అవసరమైతే మరో 24 గంటలు పొడిగిస్తాం. ఇప్పటికే పది కంపెనీల పోలీసు బలగాలు మెహరించాం. అదనంగా సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ నుంచి మూడు ప్లాటూన్లు కూడా వచ్చాయి’ అని తెలిపారు.
దుర్గామాత నిమజ్జన సమయంలో ఒకరిపై ఒకరు దాడి సరైనదేనా?
శాంతి భద్రతలు కాపాడాలని సీఎం విజ్ఞప్తి
ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, మాజీ సీఎం, బిజేడీ అధినేత నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. కటక్ నగరపు శతాబ్దాల నాటి సంస్కృతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘కటక్ వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం. ఇది ఐక్యతకు, మత సామరస్యానికి ప్రసిద్ధి. కొందరి చర్యల కారణంగా ఇటీవల శాంతికి భంగం కలిగింది. పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం ‘ అని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు.
కటక్ ఎందుకు ప్రసిద్ధి చెందింది?
కటక్ "తారకాసి" అని పిలువబడే వెండి ఫిలిగ్రీ పనికి ప్రసిద్ధి చెందింది, ఇందులో క్లిష్టమైన వెండి తీగల చేతిపనులు ఉంటాయి.
కటక్ నగరం యొక్క పాత పేరు ఏమిటి?
రాజు అనంగభీమదేవ III శాసనాలలో కనిపించే కటక్ అసలు పేరు అభినబ్-బరనాసి-కటక్. ఈ నగరం మహానది మరియు కథజోడి నదుల మధ్య ఉన్నందున ఈ పేరు పెట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/