తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మార్పు తెస్తానని ప్రకటించిన దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ, తన తొలి ఎన్నికల మేనిఫెస్టోతో అందరినీ ఆశ్చర్యపరిచింది. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సరికొత్త పంథాలో వెళ్తారని ఆశించిన వారికి, విజయ్ ప్రకటించిన భారీ ఉచిత హామీలు విస్మయానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆకాశాన్నంటుతున్న బంగారం ధరల వేళ, పిల్లలు పుడితే ఉచితంగా బంగారు ఉంగరం, అమ్మాయిల పెళ్లికి ఎనిమిది గ్రాముల బంగారం వంటి హామీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. డీఎంకే, అన్నా డీఎంకే వంటి బలమైన పార్టీలను ఢీకొట్టే క్రమంలో, విజయ్ కూడా అదే ‘ఉచితాల’ బాట పట్టడం రాజకీయ విశ్లేషకులలో భిన్నాభిప్రాయాలకు దారితీస్తోంది.
Mamata Banerjee news : బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ లోపం? ముర్ము అసహనం
విజయ్ తన మేనిఫెస్టోలో మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి వరాల జల్లు కురిపించారు. నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం, ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మరియు విద్యార్థులకు ఏటా రూ. 15,000 వంటి హామీలు ఇందులో ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను ప్రేరణగా తీసుకున్నప్పటికీ, తమిళనాడు వంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇవి ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు ఉచిత హామీలపై హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో, ‘కొండ మీద కోతిని తెస్తామన్నట్లు’ ఉన్న ఈ హామీలు ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తాయా లేక బూమరాంగ్ అవుతాయా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో గెలుపే లక్ష్యంగా భారీ రిస్క్ తీసుకున్నారని స్పష్టమవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :