📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vijayasai Reddy: ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని పాడాల్సిందే

Author Icon By Saritha
Updated: February 13, 2026 • 5:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇప్పటివరకు మనం పాడుతున్న వందేమాతరం గీతం సగమేనని తెలుసా?… అయితే పూర్తి గీతం ఎలా ఉంటుందో రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) తన ట్వీట్ లో పంచుకున్నారు. వందేమాతరం పూర్తి గీతాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు పాడిన సగం గీతం బానిసత్వానికి నిదర్శనమని, ఈ దుస్థితిని మార్చి పూర్తి ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ సమర్థించాలని పిలుపునిచ్చారు.

Read Also: BJP Government: గుజరాత్‌లో టీచర్లకు వీధి కుక్కల సర్వే బాధ్యత

‘Vande Mataram’ should be sung in its entirety

విజయసాయి (Vijayasai Reddy) తన అభిప్రాయాన్ని వివరిస్తూ, విదేశీ పాలకులు వెళ్లిపోయినా, విదేశీ మతాలు మన మధ్యే మిగిలిపోయాయి. అవి మన సంస్కృతిపై పరిపాలన చేయాలని చూస్తున్నాయి. భారతదేశంలో పుట్టిన మనకు మనసు ఉండదా? ఇప్పటికీ బానిసత్వపు సంకెళ్లేనా? అని ప్రశ్నించారు.

గత 120 సంవత్సరాలుగా విదేశీ మతాల వారు ఏమనుకుంటారోనన్న భయంతోనే సగం ‘వందేమాతరం’ గీతాన్ని పాడామా..? అని ఆయన నిలదీశారు. మన జాతీయ గేయంలో మన అమ్మవార్ల పేర్లు ఉండకూడదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని మార్చి, పూర్తి ‘వందేమాతరం’ గీతాన్ని పాడాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని విజయసాయిరెడ్డి కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Full Vandemataram Song Indian National Song Indian Patriotic Song Latest News in Telugu Rajya Sabha Former MP Social Media Telugu News vijayasai reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.