📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Vijay: కరూర్ బాధిత కుటుంబాలను కలవనున్న విజయ్?

Author Icon By Aanusha
Updated: October 26, 2025 • 8:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళ సినీ ప్రపంచంలో స్టార్ హీరోగా వెలుగొందిన విజయ్ (Vijay) ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన పంథాలో అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ కార్యకలాపాలు ఊపందుకుంటున్న వేళ, కరూర్‌లో నిర్వహించిన భారీ ప్రజా ర్యాలీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ ఘటనలో మొత్తం 41 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

Prison Gang: కేంద్రం, జైల్ నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు ప్రకటించింది

అయితే ఘటన జరిగిన నెల రోజులు కావొస్తుండగా.. విజయ్ బాధిత కుటుంబాలను కలిసేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ కేసులు, అనుమతి నిరాకరణ వల్ల జాప్యం జరుగుతూ వచ్చింది.

ఈ క్రమంలోనే మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి, పరామర్శించడానికి ఆయన ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఓ రిసార్ట్‌లో 50 గదులు బుక్ చేసి మరీ బాధిత కుటుంబాలక కోసం ప్రత్యేక బస్సులను పెట్టారు. వాటిల్లోనే వీరంతా రిసార్ట్‌ రానుండగా.. విజయ్ వారందరినీ పరామర్శించనున్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించాలనుకున్నారు

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. విజయ్ అక్టోబర్ 27వ తేదీన చెన్నై శివార్లలోని ఒక రిసార్ట్‌లో బాధిత కుటుంబాలను కలవనున్నారు. ఈ సమావేశం కోసం టీవీకే పార్టీ ఏకంగా 50 గదులను బుక్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఈ ఏర్పాటు ద్వారా బాధిత కుటుంబాల ప్రతినిధులను ఒక్కొక్కరినీ విడివిడిగా కలిసి, వారి బాధను పంచుకుని, వ్యక్తిగతంగా సానుభూతి తెలియజేయాలని విజయ్ (Vijay) భావిస్తున్నారు.వాస్తవానికి ఆయన నేరుగా కరూర్ వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించాలనుకున్నారు.

Vijay

ఆయన పర్యటనకు అనుమతి నిరాకరించింది

అయితే భద్రతా కారణాల దృష్ట్యా, అలాగే శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆయన పర్యటనకు అనుమతి నిరాకరించింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులందరినీ చెన్నైకి తీసుకు వచ్చి పరామర్శించేందుకు ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నట్లు పార్టీ స్పష్టం చేసింది.

“మేము సమావేశ స్థలానికి చేరుకోవడానికి టీవీకే పార్టీ (TVK Party) వారు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. మా కుటుంబాల నుంచి చాలా మంది సభ్యులు ఈ పరామర్శ కార్యక్రమానికి వెళ్తున్నాం” అని బాధిత కుటుంబానికి చెందిన ఒక సభ్యుడు విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News latest news Telugu News vetri kazhagam rally incident vijay karur tragedy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.