📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vijay: కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన విజయ్‌ భార్య?

Author Icon By Saritha
Updated: February 27, 2026 • 5:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vijay: తమిళ చిత్ర పరిశ్రమలో ‘దళపతి’ తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు తన భార్య సంగీత పెద్ద షాక్ ఇచ్చారు. వీరిద్దరూ విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ, సంగీత చెంగల్‌పట్టు జిల్లా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోలీవుడ్‌లో ఒక్కసారిగా చర్చ మొదలైంది.

Read Also: Delhi Liquor: మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతం

Vijay: Vijay’s wife filed a divorce petition in court?

పిటిషన్‌లో సంగీత ఇలా పేర్కొంది

కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సంగీత ఇలా పేర్కొంది. విజయ్ ఒక నటితో సంబంధంలో ఉన్నాడని.. ఆ నటితో తనకున్న సంబంధం గురించి తనకు 2021 ఏప్రిల్‌లో తెలిసిందని పేర్కొంది. విజయ్ ఆ నటితో కలిసి విదేశాలకు వెళ్లాడని.. ఆ ఫోటోలను ఆ నటి స్వయంగా షేర్ చేసిందని తెలిపింది. ఆ నటి కారణంగా తాను, తన పిల్లలు అవమానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. కానీ విజయ్ ఎలాంటి విచారం లేకుండా ఆ నటితో టచ్‌లో ఉన్నాడు అని పేర్కొంది.

26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి!

విజయ్, సంగీతల వివాహం 1999లో అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి ఒక కుమారుడు (సంజయ్), ఒక కుమార్తె (దివ్య) ఉన్నారు. గత ఏడాది కాలంగా విజయ్ పాల్గొన్న పలు కీలక వేడుకలు, రాజకీయ సభల్లో సంగీత కనిపించకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా 26 ఏళ్ల సుదీర్ఘ దాంపత్యం తర్వాత చట్టబద్ధంగా విడిపోవాలని నిర్ణయించుకోవడం అభిమానులను కలిచివేస్తోంది.

రాజకీయ ప్రయాణంలో వ్యక్తిగత కుదుపు

ప్రస్తుతం విజయ్ తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన తన పార్టీ ‘TVK’ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో ఆయన వ్యక్తిగత జీవితంలో ఇటువంటి పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విడాకుల వార్తలపై విజయ్ కార్యాలయం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sangeetha Vijay Tamil Nadu Politics Tamilaga Vettri Kazhagam Vijay divorce Vijay Thalapathy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.