TVK Puducherry candidates list Release: తమిళ స్టార్ హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. సినిమా గ్లామర్‌తో పాటు బలమైన రాజకీయ ప్రణాళికలతో తమిళనాడులో అధికారమే లక్ష్యంగా ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. తొలిసారి అరవ రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
Read Also: Assembly Elections 2026: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
TVK Puducherry candidates list Release: పుదుచ్చేరిలో 30 మంది అభ్యర్థుల ప్రకటన
కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా, పొరుగున ఉన్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ టీవీకే పార్టీ సత్తా చాటాలని నిర్ణయించుకుంది. వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో, పుదుచ్చేరిలోని మొత్తం 33 అసెంబ్లీ స్థానాలకు గాను 30 స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను విజయ్ అధికారికంగా ప్రకటించారు.
ఇక ఇప్పటికే పుదుచ్చేరిలో బీజేపీ తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేవలం 9 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను మాత్రమే బీజేపీ ప్రకటించింది. కానీ విజయ్ టీవీకే పార్టీ మాత్రం పుదుచ్చేరిలోని మొత్తం స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 4 న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక తమిళనాడు ఎన్నికల్లో విక్టరీ కోసం విజయ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: