📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

Latest News: Vijay: సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీకే పార్టీ

Author Icon By Aanusha
Updated: October 8, 2025 • 9:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులో ఇటీవల జరిగిన కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటన రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు విజయ్ (Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ (TVK party) న్యాయపరమైన చర్యలకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పై అనుమానాలు వ్యక్తం చేస్తూ, టీవీకే పార్టీ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Mohanlal: మోహన్‌లాల్‌కి మరో అరుదైన గౌరవం 

ఈ ఘటనపై రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరింది.సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన టీవీకే (TVK party)బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించిన విషయం తెలిసిందే.

ఈ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఈ నెల‌ 3న ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలను టీవీకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర పోలీసుల విచారణ నిష్పక్షపాతంగా సాగదన్న అనుమానాలను తమ పిటిషన్‌లో వ్యక్తం చేసింది.

Vijay

రాష్ట్ర పోలీసుల స్వతంత్రతపై హైకోర్టే స్వయంగా అసంతృప్తి వ్యక్తం

రాష్ట్ర పోలీసుల స్వతంత్రతపై హైకోర్టే (Madras high court) స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేసిందని, అయినప్పటికీ ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారులతోనే సిట్‌ను ఏర్పాటు చేయడం తమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని టీవీకే వాదించింది.

కొందరు దుండగులు సభలో అలజడి సృష్టించేందుకు పథకం ప్రకారం కుట్ర పన్ని ఉండొచ్చనే కోణాన్ని తోసిపుచ్చలేమని, కాబట్టి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పిటిషన్‌ (Petition) లో పేర్కొంది.తమ వాదనలు వినకుండా, ఎలాంటి వాస్తవ విచారణ జరపకుండానే హైకోర్టు తమ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేసిందని టీవీకే ఆరోపించింది.

ఇది సహజ న్యాయ సూత్రాలకు, నిష్పక్షపాత విచారణకు పూర్తి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేసి, రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ను అభ్యర్థించింది. ఈ పిటిషన్‌ను న్యాయవాదులు దీక్షితా గోహిల్, ప్రాంజల్ అగర్వాల్, యశ్ ఎస్ విజయ్ దాఖలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Karur stampede case latest news Supreme Court petition Tamilaga Vettri Kazhagam Telugu News vijay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.