Latest News: Vijay: ప్రత్యేక వేదిక పై భాదిత కుటుంబాలను కలవనున్న విజయ్

Read Time:  1 min
Vijay
Vijay
FONT SIZE
GET APP

తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన కరూర్‌ తొక్కిసలాట (Karur stampede) ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలను ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు (TVK party chief) విజయ్ (Vijay) ప్రత్యేక వేదికలో కలవనున్నారు.మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించాలని విజయ్ నిర్ణయించారు.

Taliban Trouble: భారత్ లోనూ తీరుమార్చుకొని తాలిబన్లు.. అధికారులకు తల నొప్పి

బాధిత కుటుంబాలను వారి ఇళ్ల వద్ద కాకుండా, ఒక ప్రత్యేక వేదికలో కలవాలని ఆయన నిర్ణయించారు.ఈ నెల 17న విజయ్ (Vijay) వారిని ఒక ప్రత్యేక వేదిక ద్వారా పరామర్శించనున్నారని అధికారులు తెలిపారు. వేదికకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.విజయ్ బాధితులను కలిసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేయాలని టీవీకే పార్టీ విజ్ఞప్తి చేసింది.

Vijay
Vijay

తగిన ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు

అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కరూర్‌ (Karur) లోని వేదిక నుంచి ఒక కిలోమీటరు మేర ప్రజలు ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవాలని పార్టీ వర్గాలు కోరాయి. కేవలం బాధిత కుటుంబాలకు మాత్రమే వేదిక వద్దకు ప్రవేశం ఉంటుందని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే మీడియాను అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. తిరుచ్చి విమానాశ్రయం నుంచి కరూర్‌లోని సమావేశ వేదిక వద్దకు విజయ్ చేరుకునే వరకు దారిలో ఎక్కడా జనం గుమికూడకుండా విమానాశ్రయ, ట్రాఫిక్ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.