📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Vijay: తమిళనాడులో రాజకీయ ప్రచారానికి విజయ్ సిద్ధం

Author Icon By Pooja
Updated: November 23, 2025 • 1:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళ సినీ స్టార్, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్( Vijay) తిరిగి తన రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. కాంచీపురం జిల్లాకు చెందిన మూడు తాలూకాల పార్టీ కార్యకర్తలను ఆయన ఇటీవల గోప్యంగా సమావేశపరిచినట్టు తెలిసింది. కరూర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తర్వాత సుమారు మూడు నెలలుగా నిలిచిన ప్రచారాన్ని ఎలా పునఃప్రారంభించాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.

Read Also: TG: టూరిస్టులకు గుడ్‌న్యూస్.. కృష్ణమ్మపై లాంచీ ప్రయాణం!

Vijay

భద్రతా చర్యలపై విజయ్ కీలక సూచనలు

పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, రాబోయే కార్యక్రమాలకు సంబంధించిన మార్గదర్శకాలను విజయ్( Vijay) ఈ సమావేశంలో అందించినట్లు సమాచారం. ముఖ్యంగా కరూర్ ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన కార్యకర్తలకు స్పష్టమైన సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల భద్రతనే అత్యంత ప్రాధాన్యంగా చూడాలని కూడా ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.

కరూర్ ఘటన తర్వాత జాగ్రత్తగా ముందుకు అడుగులు

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని TVK పార్టీని ప్రారంభించిన విజయ్, కరూర్‌లో జరిగిన తొలి భారీ సభలో భారీ విషాదం తలెత్తడంతో ప్రచారాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. అనంతరం డిసెంబర్ 4న సేలంలో ర్యాలీకి అనుమతి కోరినా, పోలీసులు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో విజయ్ ప్రతి అడుగును ఎంతో జాగ్రత్తగా వేస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Google News in Telugu KarurIncident Latest News in Telugu TamilNaduPolitics VijayPoliticalCampaign

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.