📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Vijay – జనాలు సభలకు వస్తారే గానీ ఓటు వేయరు..విజయ్‌కు కమల్ హాసన్ సలహా

Author Icon By Anusha
Updated: September 22, 2025 • 2:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు రాజకీయ రంగంలో అడుగుపెట్టిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌కు మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) (MNM) అధినేత కమల్ హాసన్ (Kamal Haasan) ఒక గాఢమైన సూచన చేశారు. పెద్ద ఎత్తున సభలకు వచ్చే జనసందోహం నిజంగా ఓట్లుగా మారుతుందనే భ్రమలో పడకూడదని ఆయన సూచన చేశారు.ఈ వాస్తవాన్ని ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

చెన్నై (Chennai) లో విలేకరులతో మాట్లాడిన కమల్ హాసన్, “విజయ్ లేదా నేను – ఎవరు అయినా సరే, సభల్లో జనాల సమీకరణపై మాత్రమే ఆధారపడకూడదు. ప్రజాసభలకు భారీగా జనం వస్తారన్నది ఒక వాస్తవం, కానీ అది ఎప్పుడూ ఓట్లుగా మారకపోవచ్చు. అందువల్ల నిజమైన ప్రజాభిప్రాయం సేకరించడం, సమస్యలను పరిష్కరించడం, ప్రజలకు చేరువ కావడం ముఖ్యం” అని అన్నారు.

Vijay

ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాను

రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన విజయ్‌ (Vijay) కు ఎలాంటి సలహా ఇస్తారని అడగ్గా, “ధైర్యంగా మంచి మార్గంలో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాను. ఈ విజ్ఞప్తి అందరు నాయకులకూ వర్తిస్తుంది” అని కమల్ తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలు సహజమని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పరోక్షంగా సూచించారు.

కాగా, రెండు రోజుల క్రితం తిరువారూర్‌ (Tiruvarur) లో జరిగిన ఓ సభలో విజయ్ ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. “సభకు ఇంతమంది వస్తున్నారు కానీ, వీళ్లంతా ఓట్లు వేయరని అంటున్నారు. అది నిజమేనా?” అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. దీనికి అక్కడున్న జనం ‘విజయ్.. విజయ్’ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ మద్దతు ఆయనకేనని సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/trump-tariff-what-did-rajnath-singh-say-about-indias-silence-on-us-tariffs/business/551833/

Breaking News kamal haasan advice kamal haasan statement latest news mnm party tamil nadu assembly elections Tamil Politics Telugu News TVK party Vijay political entry Vijay public meetings

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.