📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News : Vijay Kumar Sinha : ఎన్నికల వేళ బీహార్‌ ఉపముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

Author Icon By Sudha
Updated: November 6, 2025 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు నేడు తొలి విడత పోలింగ్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి విజయ్‌ కుమార్‌ సిన్హా (Vijay Kumar Sinha)కు చేదు అనుభవం ఎదురైంది. తన సొంత నియోజకవర్గం లఖిసరైలో ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ బూత్‌లను ఉపముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా కొందరు ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిపై విజయ్‌ కుమార్‌ సిన్హా (Vijay Kumar Sinha) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్జేడీ నేతలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు మేము వారి ఛాతీపై బుల్డోజర్ల తో తొక్కిస్తామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. అంతేకాదు తమ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌ల వద్ద బెదిరిస్తున్నారని, బయటకు తోసేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ప్రజలను ఓటేయకుండా అడ్డుకుంటున్నారన్నారు.

Read Also : Bihar: మన సంస్కృతి, విశ్వాసాన్ని పై మహాకూటమికి విశ్వసం లేదు మోదీ

Vijay Kumar Sinha

అయితే, పరిస్థితి అదుపులోనే ఉందని, జిల్లాలో ఓటింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని పోలీసులు తెలిపారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద బీజేపీ ఏజెంట్లను బెదిరించారంటూ వస్తున్న ఆరోపణలను జిల్లా పోలీసు చీఫ్ అజయ్ కుమార్ తోసిపుచ్చారు. అలాంటిది ఏమీ లేదన్నారు. అలా జరిగి ఉంటే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ఓటింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

విజయ్ కుమార్ సిన్హా రాజకీయ జీవితం?

విజయ్ కుమార్ సిన్హా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాలో పని చేసి 2005లో లఖిసరాయ్ శాసనసభ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2005లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. విజయ్ కుమార్ సిన్హా 2005 నుండి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, 25 నవంబర్ 2020 నుండి 24 ఆగస్టు 2022 వరకు బీహార్ శాసనసభ స్పీకర్‌గా పని చేసి అప్పటి సంకీర్ణ ప్రభుత్వమైన మహాఘ్‌బంధన్‌లో అతనిపై అవిశ్వాస తీర్మానం రావడంతో తన పదవికి రాజీనామా చేశాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Bihar Politics Breaking News Deputy Chief Minister elections latest news Political News Telugu News Vijay Kumar Sinha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.