తమిళనాడు (Tamil Nadu) లోని కరూర్ జిల్లా (Karur District) లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. తాజాగా, ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ (TVK Party) అధినేత తలపతి విజయ్ (Vijay) బాధితులను వ్యక్తిగతంగా కలిసి పరామర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
Vijay: సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీకే పార్టీ
ఈ మేరకు ఆయన తమిళనాడు డీజీపీకి ఈ-మెయిల్ (E-mail) ద్వారా ఒక విజ్ఞప్తి పంపారు. కరూర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను వ్యక్తిగతంగా కలుసుకుని సంతాపం తెలియజేయాలని, బాధితులతో నేరుగా మాట్లాడి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే విజయ్ (Vijay) వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు వారిని స్వయంగా కలవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల అనుమతి కోసం అధికారికంగా ప్రయత్నాలు ప్రారంభించారు.
విజయ్ విజ్ఞప్తికి పోలీసుల నుంచి అనుమతి లభిస్తుందా? లేదా?
అయితే, విజయ్ విజ్ఞప్తికి పోలీసుల నుంచి అనుమతి లభిస్తుందా? లేదా? అన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. కరూర్ సభలో తొక్కిసలాట జరగడానికి విజయ్ (Vijay) ఆలస్యంగా రావడమే ప్రధాన కారణమని పోలీసులు ఇప్పటికే ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఆయన పర్యటనకు అధికారులు అంగీకరించకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.మరోవైపు, ఈ దుర్ఘటనపై విజయ్, స్టాలిన్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది.
ప్రభుత్వ వైఫల్యం, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విజయ్ ఆరోపిస్తుండగా.. విజయ్ నిర్లక్ష్యమే ప్రజల ప్రాణాలు తీసిందని ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. కాగా, కరూర్‌లో జరిగిన ఈ విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 61 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: