📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Vice president: ఉపరాష్ట్రపతి రేస్లో ఐదుగురు.. కసరత్తు ముమ్మరం

Author Icon By Ramya
Updated: July 23, 2025 • 4:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vice president: సోమవారం రాత్రి ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా దేశరాజకీయాల్లో వేడిని పుట్టిస్తోంది. మరో రెండేండ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన కుర్చీని ఖాళీచేశారు. తన ఆనారోగ్య కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ధనఖడ్ పేరొ ్కన్నారు. ప్రస్తుతం రాజ్యసభ ఛైర్మన్ పదవి ఖాళీగా ఉంది. రేస్ లో ఐదుగురు, ఇద్దరు మహిళల పేర్లు తదుపరి ఉపరాష్ట్రపతికి కేంద్రం అప్పుడే కసరత్తులను చేస్తున్నది. ఉపరాష్ట్రపతి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. బీహార్ సీఎం నితీశ్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, నిర్మలా సీతారామన్, దగ్గుపాటి పురందేశ్వరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నియామకం సందర్భంలో కూడా ఈ ఇరువురి మహిళల పేర్లు బాగా వార్తల్లో నిలిచాయి. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్న హరివంశ నారాయణసింగ్ (Harivansh Narayan Singh) పేరు వినిపిస్తోంది. నితీష్ కుమార్ కొన్నేళ్లపాటూ బీహార్ సిఎంగా కొనసాగుతున్నారు.

Vice president: ఉపరాష్ట్రపతి రేస్లో ఐదుగురు.. కసరత్తు ముమ్మరం

నితీశ్, శశిథరూర్ పేర్లు ఉపరాష్ట్రపతి పదవికి పరిశీలనలో

Vice president: త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. ఆయన్ని సీఎం కుర్చీ నుంచి తప్పించి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు ఆయన కూడా కేంద్ర పదవిపై ఆశపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే అందులో కొనసాగేందుకు ఆయన కూడా సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ గత కొంతకాలంగా కేంద్రంలోని బీజెపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. నరేంద్రమోడీ పనులను, బీజెపీ నిర్ణయాలను ఆయన సమర్థిస్తూ, కాంగ్రెస్ విమర్శలకు గురవుతున్నారు. సొంతపార్టీ నేతలే ఆయనను తప్పుపడుతున్నారు. అయినా ఆయన అవేవీ పట్టించుకోకుండా విమర్శలకు దీటుగా బదులిస్తూ, త్వరలో బీజెపీలో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం జోరుగా సాగుతున్నది.

ఉపరాష్ట్రపతి రేసులో దక్షిణాది నేతలకు ప్రాధాన్యతతో బీజేపీ వ్యూహం స్పష్టంగా మారుతోంది

దీంతో ఉపరాష్ట్రపతిగా ఆయన పేరును బీజెపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహిళలకు ప్రాధాన్యత దక్షణాదిలో బీజేపీ ప్రాబల్యం పెంపొందాలంటే పెద్ద పదువులు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారికి అవకాశం ఇవ్వాలి అనే అభిప్రాయంలో బీజేపీ ఉంది. తమిళనాడు, తెలుగురాష్ట్రాలను పరిగణనలోనికి తీసుకుని, పురందేశ్వరి లేదా నిర్మలా సీతారామన్లకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నిర్మలా సీతారామన్ ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రిగా కొనసాగుతున్నారు. అనుభవం ఉన్న నిర్మలా అయితే ఆ పదవికి బాగుంటుందని భావించే నేతలు కొందరు అయితే, టీడీపీ మాత్రం ఎన్టీఆర్ కుతురిగా పురందేశ్వరికి అవకాశం ఇస్తే బాగుంటుందని భావిస్తున్నది. జమ్ముకశ్మీర్లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Karnataka: కర్ణాటకలో కొనసాగుతున్న చిరువ్యాపారుల బంద్

Breaking News Jagdeep Dhankhar Resignation latest news Nitish Kumar Purandeshwari Shashi Tharoor Telugu News Vice President Election

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.