Veer Soren: హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మనాలిలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ మనవడు వీర్ సోరెన్ అనూహ్యంగా మరణించారు. సెలవుల కోసం స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లిన వీర్, హోమ్లో స్పృహ తప్పిన స్థితిలో కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Read Also:Guntur POCSO Case: పొక్సో కేసులో నిందితుడికి 20 యేళ్ల జైలుశిక్ష
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతదేహంపై ఎలాంటి గాయాలు లేదా హింసకు సంబంధించిన గుర్తులు లేవు. అయితే నోటి నుంచి నురుగు రావడం గమనించామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మరణానికి గల అసలు కారణాన్ని తెలుసుకునేందుకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. వీర్ సోరెన్ అకాల మరణం సోరెన్ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. కుటుంబ సభ్యులు, రాజకీయ నేతలు, అనుచరులు ఈ విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: