Varun Gandhi: ప్ర‌ధాని మోదీని క‌లిసిన వ‌రుణ్ గాంధీ ఫ్యామిలీ

Read Time:  1 min
Varun Gandhi: ప్ర‌ధాని మోదీని క‌లిసిన వ‌రుణ్ గాంధీ ఫ్యామిలీ
FONT SIZE
GET APP

Varun Gandhi: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తన కుటుంబంతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలుసుకున్నారు. బీజేపీ నేత, పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశానికి, దేశ ప్రజలకు మోదీయే నిజమైన సంరక్షకుడు అని ఆయన అభివర్ణించారు. 

Read Also: UNO: ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

Varun Gandhi: ప్ర‌ధాని మోదీని క‌లిసిన వ‌రుణ్ గాంధీ ఫ్యామిలీ
Varun Gandhi: Varun Gandhi’s family meets Prime Minister Modi.

ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను వరుణ్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో, వరుణ్ గాంధీ మళ్లీ బీజేపీలో క్రియాశీలకంగా మారే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో ఫిలిబిత్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వరుణ్, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి పక్కన పెట్టబడ్డారు.

గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీని నా కుటుంబంతో కలిసి కలవడం, ఆయన ఆశీస్సులు, మార్గనిర్దేశం పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని వరుణ్ గాంధీ తన పోస్టులో రాశారు. ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని, నాయకత్వాన్ని కొనియాడుతూ, “మీ వ్యక్తిత్వంలో అద్భుతమైన పితృ వాత్సల్యం, రక్షణ భావన ఉన్నాయి. మీతో భేటీ అయిన తర్వాత, మీరే ఈ దేశానికి, ప్రజలకు నిజమైన సంరక్షకుడనే నా నమ్మకం మరింత బలపడింది” అని వరుణ్ గాంధీ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.