📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Telugu news: Vande Bharat Sleeper: తొలి వందేభారత్ స్లీపర్ రెడీ

Author Icon By Tejaswini Y
Updated: December 9, 2025 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రైల్వే శాఖ నుంచి వందేభారత్ స్లీపర్(Vande Bharat Sleeper) రైళ్లపై ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ అధికారికంగా వెలువడింది. పూర్తిగా ‘మేక్ ఇన్ ఇండియా’ కాన్సెప్ట్‌తో అత్యాధునిక సదుపాయాలు, మెరుగైన భద్రతా వ్యవస్థలతో రూపొందించిన వందేభారత్ స్లీపర్ రైలు తొలి ప్రయాణానికి తేదీ ఖరారైంది. దేశవ్యాప్తంగా దశలవారీగా ఈ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మొదటి దశలోనే తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు రైట్స్‌ అనుమతి కూడా లభించింది.

Read Also: Manish Tewari : ప్రత్యేక సమగ్ర సవరణ చేసే హక్కు ఎన్నికల సంఘానికి లేదు :మనీశ్‌ తివారీ

బడ్జెట్‌ తరహా స్లీపర్ సౌకర్యాలు

బడ్జెట్‌ తరహా స్లీపర్ సౌకర్యాలు కలిగిన ఈ కొత్త వందేభారత్ రైలు డిసెంబర్ 25న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 2019లో లాంచ్ అయిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి విపరీత ఆదరణ లభించడంతో, దేశంలో ఇప్పటికే 100 పైగా వందేభారత్ రైళ్లు దూసుకెళ్తున్నాయి.

Vande Bharat Sleeper

బెంగళూరు(Bangalore)లోని బీఈఎంఎల్ ఫ్యాక్టరీలో తయారైన ఈ స్లీపర్ రైలు ట్రయల్ రన్ కోసం డిసెంబర్ 12న నార్తర్న్ రైల్వేకు అప్పగించనున్నారు. 16 కోచ్‌లతో రూపొందించిన ఈ రైలులో మొత్తం 827 బెర్త్‌లు ఉంటాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా, అదనపు భద్రత కోసం ‘కవచ్’ సిస్టమ్‌ని అమర్చారు. రాత్రిపూట ప్రయాణించే వారికి హోటల్ స్థాయి కంఫర్ట్ అందేలా డిజైన్ చేశారు.

వందేభారత్ స్లీపర్‌ను ఢిల్లీ–పాట్నా రూట్‌

మొదటి వందేభారత్ స్లీపర్‌ను ఢిల్లీ–పాట్నా రూట్‌పై నడిపేలా ప్రణాళిక సిద్ధమైంది. ఆటోమేటిక్ డోర్లు, బయోటాయిలెట్లు, సీసీటీవీ సెక్యూరిటీ, రీడింగ్ లైట్లు, ప్రీమియమ్ ఇంటీరియర్‌లతో రైలును తీర్చిదిద్దారు. ఈ రైలు వారంలో ఆరు రోజులపాటు నడిచే అవకాశం ఉంది. పట్నా రాజేంద్రనగర్ టెర్మినల్ నుండి సాయంత్రం బయలుదేరి, తెల్లవారే సరికి ఢిల్లీ చేరుతుంది.

మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో కూడా వందేభారత్ స్లీపర్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్–ఢిల్లీ, విజయవాడ–అయోధ్య, విశాఖపట్నం–తిరుపతి రూట్‌లకు రైళ్ల కేటాయింపుపై రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిలో ఒక రూట్‌కు వచ్చే వారం అధికారిక గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Indian Railways New Train Launch Railway Update telugu states Vande Bharat Patna Delhi Vande Bharat Sleeper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.