📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Vande Bharat Express :రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్

Author Icon By Sudha
Updated: July 7, 2025 • 5:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణించే రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్(Good news) చెప్పింది. అధిక డిమాండ్ కారణంగా వందే భారత్ ట్రైన్ (Vande Bharat Express )కోచ్‌ల సంఖ్యను 16 కి పెంచుతూ ఇండియన్ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express ) రైలు 16 కోచ్‌లతో జులై 10 2025 నుంచి ప్రయాణికులకు అందుబాటులో రానుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ ప్రకటనలో తెలిపారు. 10.07.2025 నుంచి కాచిగూడ – యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సీటింగ్ సామర్థ్యం 530 నుండి 1,128కి పెరగనుంది. రైలు నెం. 20703/20704 కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ మధ్య నడిడే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మొదట 08 కోచ్‌ల కూర్పుతో ప్రవేశపెట్టారు.. ఇందులో 01 ఎగ్జిక్యూటివ్ క్లాస్, 07 చైర్ కార్లు ఉన్నాయి. సాధారణ సర్వీసులు ప్రవేశపెట్టినప్పటి నుండి, రైలు 100శాతం కంటే ఎక్కువ ప్రోత్సాహంతో స్థిరంగా నడుస్తోంది.

Vande Bharat Express :రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్

అదనపు కోచ్‌లను

దీంతో ఈ రైలుకు పెరిగిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, రైల్వే ఇప్పటికే ఉన్న రైలు బోగిలు 08కి అదనపు కోచ్‌లను జత చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం, జూలై 10, 2025 నుంచి ప్రస్తుత 08 కోచ్‌ల సామర్థ్యంతో కాకుండా 16 కోచ్‌ల సామర్థ్యంతో రైలును నడపడానికి ప్రణాళికలు చేశారు. కొత్త కోచ్‌లతో 1024 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో 14 చైర్ కార్లు, 104 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో 02 ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగిలు అందుబాటులోకి రానున్నాయి.. మొత్తం 1128 ప్రయాణికులు సామర్థ్యంతో కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయనుంది.

అధిక డిమాండ్

కాగా.. 2023 సెప్టెంబర్ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express ) రైలును వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే.. అప్పటినుంచి ఈ రైలు అధిక డిమాండ్ తో పరుగులు తీస్తోంది. పెరిగిన డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని.. కోచ్ లను 16కు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ కోచ్‌ల రెట్టింపుతో, ఐటీ నగరాలైన హైదరాబాద్ – బెంగళూరు మధ్య ఇప్పుడు ఎక్కువ మంది రైలు ప్రయాణికులు వందే భారత్ రైలు సేవలను పొందగలరని దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది.

వందే భారత్ అంటే ఏమిటి?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశంలో తయారైన మొట్టమొదటి అర్ధ హైస్పీడ్ ట్రైన్.

ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనాలు?

శీఘ్ర ప్రయాణం – సమయం ఆదా

ఆధునిక సౌకర్యాలు – LED డిస్‌ప్లేలు, ఆటోమేటిక్ డోర్లు, బయో టాయిలెట్స్

Read hindi: hindi.vaartha.com

Read Also:Tirumala: తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైలు

Breaking News FastTrainIndia IndianRailways latest news SouthCentralRailway Telugu News TeluguRailwayNews VandeBharatExpress

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.