📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Vaks chattam:పేద ముస్లింలకు మోదీ సర్కారు న్యాయం

Author Icon By Digital
Updated: April 18, 2025 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vaks chattam : దేశంలోని పేద ముస్లింలకు మేలు చేసేలా వక్స్ చట్టాన్ని సవరించడంపై కేంద్ర ప్రభుత్వం పారదర్శక చర్యలు తీసుకుంటోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ తెలంగాణ కార్యాలయంలో నిర్వహించిన Vaks chattam సుధార్ జనజాగరణ అభియాన్’ వర్క్షాప్‌లో ఆయన మాట్లాడారు. వక్స్ చట్టాన్ని సవరించేందుకు ఇప్పటికే 2024 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో పర్యటించి వేలాది ప్రజల అభిప్రాయాలను సేకరించిందన్నారు. ఈ మేరకు పార్లమెంటులో 21 గంటల పాటు చర్చలు జరిగినట్టు వివరించారు.వక్స్ బోర్డు ఆధీనంలోని భూముల ఆదాయాన్ని పేద ముస్లింలకు ఉపయోగపడేలా చేసే ఉద్దేశంతో ఈ చట్ట సవరణలు తీసుకువచ్చామని అన్నారు. దేశంలో రైల్వే, రక్షణ శాఖల తర్వాత అత్యధిక భూములు వక్స్ బోర్డు ఆధీనంలో ఉన్నప్పటికీ, వాటి ఆదాయం పేద ముస్లింలకు ప్రయోజనం కలిగించలేదన్నారు. వాస్తవంగా 2006లో వక్స్ ఆస్తుల పరిమాణం 4.9 లక్షల ఎకరాలుగా ఉండగా, ఆదాయం మాత్రం రూ.160 కోట్లకే పరిమితమైందని, 2013లో అది రూ.166 కోట్లు మాత్రమే అయ్యిందని చెప్పారు. భూముల విలువ పెరుగుతున్నా ఆదాయం పెరగకపోవడంపై ఆయన ప్రశ్నలు వేశారు.

Vakschattam:పేద ముస్లింలకు మోదీ సర్కారు న్యాయం

వక్స్ చట్ట సవరణపై కేంద్ర ప్రభుత్వ దృష్టి

వక్స్ భూముల ఆడిట్, డిజిటలైజేషన్, జియో ట్యాగింగ్ వంటి చర్యల ద్వారా పారదర్శకత తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు. ఇకపై వక్స్ క్లెయిమ్ చేసే ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పరిశీలించి, సర్వే చేసి హక్కును నిర్ధారిస్తామని చెప్పారు. వక్స్ బోర్డు ఆధీనంలో ఉన్న 77 వేల ఎకరాల భూములు, 35 వేల ప్రాపర్టీల ఆదాయాన్ని ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ చట్ట సవరణల పట్ల ముస్లిం సమాజం ఎక్కువగా మద్దతు ఇస్తోందని, పేద ముస్లింల అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళలకు రక్షణ కల్పించిన మోడీ ప్రభుత్వమే వక్స్ చట్టాన్ని కూడా పేద ముస్లింలకు మేలు చేసేలా సవరించిందన్నారు. చర్చ్ బోర్డు, టెంపుల్ కమిటీలు వేరు అయినట్టు, వక్స్ బోర్డు చట్టాన్ని కూడా వేరే కోణంలో చూడాలని సూచించారు. మతాల మధ్య భేదాలు లేకుండా, అందరికీ మేలు చేకూరే విధంగా చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

Read more : Bhubharathi : భూ భారతి.. కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

BJP Telangana Breaking News in Telugu Google news Google News in Telugu Kishan Reddy Latest News in Telugu Modi government Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Waqf Act Amendment Welfare of Poor Muslims

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.