నవరాత్రి శుభసమయంలో భక్తులకు సంతోషవార్త – వైష్ణో దేవి యాత్ర (Vaishno Devi Yatra) పునఃప్రారంభం. శ్రీమాతా వైష్ణో దేవి యాత్రికులకు కొంతకాలంగా ఎదురైన అంతరాయాలు తొలగిపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిపోయిన యాత్రను అధికారులు గురువారం ఉదయం నుండి తిరిగి ప్రారంభించారు. దీంతో భక్తులు, స్థానిక వ్యాపారులు ఊరట చెందారు.
అన్ని ఏర్పాట్లుచేశారు
ఉదయం 6 గంటల నుంచే యాత్రికులను బేస్ క్యాంప్ నుండి ఆలయం వరకు అనుమతిస్తూ అన్ని ఏర్పాట్లుచేశారు. పొగమంచు కారణంగా నిలిచిపోయిన హెలికాప్టర్ (Helicapter) సర్వీసులు కూడా మళ్లీ ప్రారంభమయ్యాయి. మొదటి రోజే 3,500 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు శ్రీమాతా వైష్ణో దేవి (Vaishno Devi Yatra) శ్రైన్ బోర్డు (SMVDSB) తెలిపింది.
Vaishno Devi Yatra
కొండచరియల విరిగిపడటం
గతంలో వర్షాలు, పొగమంచు, కొండచరియల విరిగిపడటం వంటివి యాత్రను పలుమార్లు అడ్డుకున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 26న జరిగిన ప్రమాదంలో 34 మంది యాత్రికులు మృతి చెందడం విషాదకరం. ఆ తర్వాత 22 రోజుల పాటు యాత్ర నిలిచిపోయింది. నిన్న పునఃప్రారంభమైన యాత్ర వాతావరణం మరింత ప్రతికూలం కావడంతో మరోసారి ఆగిపోయింది. ఈ నెల 22 నుండి ప్రారంభమయ్యే నవరాత్రుల (Navratri) సందర్భంగా భారీ రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. “భక్తుల భద్రత మా మొదటి కర్తవ్యం”. యాత్ర సజావుగా కొనసాగేందుకు అన్ని మార్గదర్శకాలను పాటించాలి” అని ఒక ఆలయ అధికారి సూచించారు.
వైష్ణో దేవి యాత్ర ఎందుకు నిలిపివేయబడింది?
ప్రతికూల వాతావరణం, పొగమంచు, కొండచరియల విరిగిపడటం వంటి కారణాల వల్ల యాత్ర తాత్కాలికంగా నిలిపివేయబడింది.
యాత్ర ఎప్పుడు పునఃప్రారంభమైంది?
A2: గురువారం ఉదయం 6 గంటల నుంచి అధికారులు యాత్రను తిరిగి ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: