📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Latest News: Uttarakhand Crime: స్కూల్ సమీపంలో 20 కిలోల పేలుడు పదార్థాలు

Author Icon By Anusha
Updated: November 23, 2025 • 10:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరాఖండ్‌‌ (Uttarakhand) లోని ఓ ప్రభుత్వ స్కూల్ సమీపంలో పేలుడు పదార్థాలు లభించడం కలకలం రేపింది.. అల్మోరా జిల్లాలోని సుల్త్ ప్రాంతంలోని దబారా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 20 కేజీల బరువున్న 161 జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి పొదల్లో ఇవి లభించడంతో అప్రమత్తమైన పోలీసులు సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Read Also: Anarkali Elephant : 57 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన ఏనుగు

పాఠశాల ప్రిన్సిపాల్ సుభాష్ సింగ్ మొదటగా పొదల్లో అనుమానాస్పద ప్యాకెట్లను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రెండు పోలీసు బృందాలు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

ఉధమ్ సింగ్ నగర్, నైనిటాల్ జిల్లాల నుంచి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను కూడా రప్పించారు.డాగ్ స్క్వాడ్ జరిపిన గాలింపులో పొదల్లో కొన్ని జిలెటిన్ స్టిక్స్ ప్యాకెట్లు లభించగా, మరికొన్ని 20 అడుగుల దూరంలో దొరికాయి. మొత్తం 161 జిలెటిన్ స్టిక్స్‌ను బాంబ్ స్క్వాడ్ సిబ్బంది సురక్షితంగా సీల్ చేసి భద్రపరిచారు.

నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు

ఈ విషయాన్ని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) దేవేంద్ర పించా ధ్రువీకరించారు. “దబారా గ్రామ పాఠశాల దగ్గర పొదల్లో 161 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నాం.

Uttarakhand Crime: 20 kg of explosives found near school

బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో కలిసి పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టాం” అని ఆయన తెలిపారు.సాధారణంగా నిర్మాణాలు, మైనింగ్ పనుల్లో రాళ్లను పేల్చేందుకు జిలెటిన్ స్టిక్స్‌ను ఉపయోగిస్తారు.

కేసు నమోదు

అయితే, ఇంత భారీ మొత్తంలో వీటిని గ్రామానికి ఎందుకు తీసుకొచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారి వివరించారు. ఈ ఘటనపై పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1908, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కేసు నమోదు చేశారు.

లోతైన విచారణ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఎస్‌పి వెల్లడించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు, హరియాణాలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్న విషయం తెలిసిందే.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Almora news explosive sticks latest news SCHOOL Telugu News Uttarakhand blast material

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.