గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
గంగోత్రీ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్
ఉత్తరాఖండ్(UttaraKhand)లోని గంగోత్రీ(Gangotri) ప్రాంతంలో కుండపోత వర్షాల కారణంగా క్లౌడ్ బరస్ట్ జరిగింది. ధరావలి గ్రామం మునిగిపోయింది. కొండచరియల విరిగిపాటు – గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయిన దృశ్యం. కొండపై నుంచి విరిగిపడ్డ పెద్ద పెద్ద బండరాళ్లు గ్రామాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. కొన్ని ఇళ్లు మట్టిపాలయ్యాయి. ప్రజలు భయంతో పరుగులు తీశారు.
భయానక దృశ్యాలు వైరల్.. సహాయక బృందాలు రంగంలోకి
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. NDRF, SDRF బృందాలు హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించాయి.
కొండచరియల కింద చిక్కుకున్న గ్రామస్థులు
ప్రస్తుతం కొంతమంది గ్రామస్థులు ఇంకా ఆ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. వారిని బయటకు తీయేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టుకుని పోయింది .
ఉత్తరాఖండ్ దేనికి ప్రసిద్ధి చెందింది?
ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు - ఉత్తరాఖండ్ మానవులు
దేవభూమి (దేవతల భూమి) అని కూడా పిలువబడే ఉత్తరాఖండ్, అద్భుతమైన హిమాలయ ప్రకృతి దృశ్యాలు, అనేక హిందూ తీర్థయాత్ర స్థలాలు మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది.
ఉత్తరాఖండ్ చరిత్ర ఏమిటి?
"దేవభూమి" లేదా "దేవతల భూమి" అని కూడా పిలువబడే ఉత్తరాఖండ్, హిందూ పురాణాలు మరియు వివిధ రాజవంశాలతో లోతుగా ముడిపడి ఉన్న గొప్ప మరియు పురాతన చరిత్రను కలిగి ఉంది. దీని చరిత్ర చరిత్రపూర్వ కాలం నుండి 2000లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే వరకు, కురు మరియు పంచల్ రాజ్యాల ప్రభావాలతో విస్తరించి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: