📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Latest News: Uttarakhand – ఉత్తరాఖండ్ లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. 10మంది గల్లంతు

Author Icon By Anusha
Updated: September 18, 2025 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాబోయ్ వద్దంటే వర్షాలు. ఎక్కడ చూసిన వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు నెల నుంచి దేశంలో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళఖాతంలో తరచూగా ఏర్పడుతున్న అల్పపీడనం వాయిగుండంగా మారి, భారీ తుపానులు, వర్షాలతో
నదులు, ప్రాజెక్టులు నీళ్లతో నిండిపోతున్నాయి. తద్వారా అకస్మాత్తుగా వరదలు వస్తున్నాయి. వీటికి తోడు ఇటీవల క్లౌడ్ బరస్ట్లు (Cloudburst) సంభవిస్తుండడంతోఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో తెలియక భయం గుప్పిట్లో ప్రజలు జీవిస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్ సంభవించి, పదిమంది గల్లంతు అయ్యారు.

చమోలీ జిల్లాలో కుండపోత వర్షాలు

ఉత్తరాఖండ్ (Uttarakhand) లో చమోలీ జిల్లా నందానగర్ లో కుండపోత వర్షాలు కురిశాయి. దీని కారణంగా అక్కడ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఈ భారీ వరదలకునందానగర్ లో పదిమంది గల్లంతయ్యారు. అంతేకాక పలు ఇళ్లు, కోడ్లు కొట్టుకుపోయాయి. ఆరుభవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొట్టుకు పోతున్న ఇళ్ల నుంచి ఇద్దరిని రెస్క్యూ బృందం రక్షించింది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Uttarakhand

వరదల్లో చిక్కుకున్న వారిని,రెస్క్యూ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. తప్పిపోయిన పదిమందిలో ఆరుగురు కుంత్రిలలా ఫాలి గ్రామం, ఇద్దరు సర్పాని, ఇద్దరు,దుర్మా ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. ఇందులో ఒక 75 ఏళ్ల పెద్దాయన, పదేళ్ల బాలుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం చమోలీలో ఇంకా వర్షాలు,కురుస్తుండడంతో రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) కష్టమౌతోందని చెబుతున్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

డెహ్రాడూన్లో క్లౌడ్ బరస్ట్ కు 13 మంది మృతి

నాలుగు రోజుల క్రితం రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ (Dehradun) లో సంభవించిన మేఘాల విస్ఫోటనం కారణంగా కనీసం 13మంది మరణించారు. రోడ్లు,కొట్టుకుపోయాయి. ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయి. రెండవ ప్రధాన వంతెనలు కూలిపోయాయి. నగరాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు
అనుసంధానించే హైవేలు దారుణంగా తయారయ్యాయి. మరోవైపు కొండప్రాంత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉత్తరాఖండ్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో కూడా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరగిపడడంతో ముగ్గురు మరణించారు.

మరో మూడురోజులు వర్షాలు తప్పవు

డెహ్రాడూన్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ ఈనెల 20వ తేదీ వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని.. జాగ్రత్తగా ఉండకపోతే మరింత ప్రాణనష్టం,తప్పదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తున్నది. కొండచరియలు విరిగిపడటం, మౌలిక సదుపాయాలు కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/sending-a-few-people-to-jail-will-not-solve-this-problem/national/549522/

Breaking News cyclones Floods Heavy Rains latest news low pressure in Bay of Bengal public suffering rivers and projects overflowing sudden floods Telugu News widespread rainfall

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.