📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Uttar Pradesh: సైనికుడిపై టోల్ గేట్ సిబ్బంది కర్రలతో దాడి..

Author Icon By Sharanya
Updated: August 18, 2025 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సైనికులు అంటే దేశాన్ని కాపాడేవారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. దేశసరిహద్దులో నిరంతరం కాపలా కాస్తుంటారు. యుద్ధం కోసం ఏ క్షణంలో చేసేందుకైనా సిద్ధంగా ఉంటారు. సరిహద్దు దేశాలు అక్రమంగా భారత్లో జొరపడకుండా గడ్డకట్టిన మంచులో సైతం రాత్రీపగలు కాపలా కాస్తుంటారు. వారు కాపలా కాయడం బట్టే
కదా మనం హాయిగా జీవించగలుగుతున్నాం. సైనికులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి సేవలు అద్భుతం. ఎందుకు ఇదంతా చెబుతున్నారని అనుకుంటున్నారా? సైనికులను గౌరవించాల్సింది పోయి వారిపై దాడికి పాల్పడే వారిని ఏమనాలి? ఎక్కడని అంటారా అయితే ఆ వివరాలు ఏమిటో మీరే చదవండి.

Uttar Pradesh

ఆర్మీ జవాన్ పై దాడి

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని మేరఠ్ టోల్ గేట్ (Meerut Toll Gate) వద్ద ఆర్మీ జవాన్ పై టోల్ గేట్ సిబ్బంది కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసింది. ఇందుకు కారణం అతను ఆ సిబ్బందిని ప్రశ్నించడమే. సెలవుల అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్తూ, టోల్ గేట్ వద్ద ఆలస్యాన్ని జవాన్ కపిల్ ప్రశ్నించడంతో సిబ్బంది దాడికి పాల్పడింది. రాజ్పుత్ రెజిమెంట్లో సైనికుడిగా పని చేస్తున్న బాధిత ఆర్మీ జవాన్ కపిల్ కవాడ్ (Jawan Kapil Kawad) పై మేరర్ టోల్ గేట్ వద్ద సిబ్బంది కర్రలతో విచాక్షణారహితంగా దాడి చేశారు. గాయపడ్డ కపిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాడికి పాల్పడ్డ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాచారం తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/dogs-bite-stray-dogs-attack-a-child-inhumanely-the-girls-condition-is-critical/national/531806/

Breaking News Indian Army latest news Road Rage Soldier Assault Telugu News Toll Gate Attack Uttar Pradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.