కొన్ని ఉపద్రవాలు వెంటవెంటనే వస్తాయి. ఒక విషాదం చోటు చేసుకుని, ఆ బాధ నుంచి ఇంకా కోలుకోకముందే మరో విషాదం జరిగితే ఎంత వేదన కలుగుతుంది? ఆ వ్యథకు అంతులేదు. నిర్లక్ష్యమో అజ్ఞానమో తెలియదు కానీ ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు గంటల వ్యవధిలో మరణించిన అంతులేని విషాద ఘటన ఇది. ఉత్తరప్రదేశ్ లో (Uttar Pradesh) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలకు జ్వరం సోకింది. సకాలంలో చికిత్స అందించినప్పటికీ వారి ప్రాణాలు దక్కలేదు.
Read Also: Dithwa Cyclone: తమిళనాడుకు రెడ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలోనూ భారీ వర్షాలు
చికిత్స అందించినా దక్కని ప్రాణాలు
అసలేం జరిగిందంటే..నెబువా నౌరంగియా బ్లాక్ లోని గులార్హియా తోలా గ్రామంలో పింటు గౌర్ అనే వ్యక్తి కుమార్తె మంజు గౌర్ అనే వ్యక్తి కుమార్తె మంజు(7) వారం క్రితం అనారోగ్యానికి గురైంది. స్థానిక వైద్యుడి వద్ద చికిత్స అందించనప్పటికీ బాలిక కోలుకోలేదు. ఈ క్రమంలో మరో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తర్వాత కొన్ని గంటలకే గౌర్ కు చెందిన చిన్న కుమార్తె ఖుషి (3), కుమూరుడు కృష్ణ(5) జ్వరంతో (fever) మృతి చెందారు. దీంతో ఆ తల్లిదండ్రులు, బంధువుల వేదన వర్ణనాతీతంగా మారింది. గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారుల మృతితో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
వీరి మృతి కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి, గ్రామంలోని మిగిలిన పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పిల్లల మృతికి గల కారణాలు తెలుపుతామని అన్నారు. శీతాకాలంలో దోమలతో జాగ్రత్తగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: