Uttar Pradesh: అత్తమామలకే విషమిచ్చి ఆస్తితో ఉడాయించిన అల్లుడు

Read Time:  1 min
Uttar Pradesh: అత్తమామలకే విషమిచ్చి ఆస్తితో ఉడాయించిన అల్లుడు
FONT SIZE
GET APP

Uttar Pradesh: నమ్మించి గొంతు కోయడం అంటే ఇదేనేమో! తన తప్పులను మన్నించమని కాళ్లావేళ్లా పడి అత్తగారింట్లో అడుగుపెట్టిన ఓ అల్లుడు, కనికరించిన వారికే విషమిచ్చి కోట్లాది రూపాయల సంపదతో పరారయ్యాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నహ్తౌర్‌లోని కైపట్ల ప్రాంతంలో ఈ సంచలన ఘటన వెలుగుచూసింది.

Read Also: kalvakuntla kavitha : ‘పద్మవ్యూహం’లోకి కవిత అడుగులు!

Uttar Pradesh: అత్తమామలకే విషమిచ్చి ఆస్తితో ఉడాయించిన అల్లుడు
Uttar Pradesh Son-in-law poisons in-laws and flees with property

సంతోష్ వర్మ అనే వ్యక్తి తన ఏకైక కుమార్తె దివ్యాంగురాలు కావడంతో, ఆమెకు తోడుగా ఉంటాడనే నమ్మకంతో నవీన్ అనే వ్యక్తికి ఆశ్రయమిచ్చాడు. అయితే, మాదకద్రవ్యాలకు వ్యసనపరుడైన నవీన్‌ను రెండు నెలల క్రితం ఇంట్లో నుండి వెళ్లగొట్టారు. ఇంటి ఆస్తిపై కన్నేసిన నవీన్, ఎనిమిది రోజుల క్రితం కన్నీళ్లు పెట్టుకుంటూ, తనను క్షమించమని వేడుకుంటూ తిరిగి అత్తగారింట్లోకి ప్రవేశించాడు. మనసు కరిగిన అత్తమామలు అతనికి మరో అవకాశం ఇచ్చి ఇంట్లో చోటు కల్పించారు.

రెండు కోట్ల విలువైన నగదు చోరీ

ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం రాత్రి నవీన్ తన కిరాతక ప్లాన్‌ చేశాడు. రాత్రి భోజనం, పానీయాలలో మత్తుమందు కలిపి అత్తమామలకు, తన దివ్యాంగురాలైన భార్యకు తినిపించాడు. వారంతా అపస్మారక స్థితిలోకి చేరుకోగానే, ఇంటి సేఫ్‌లను గాలించాడు. అర కిలో బంగారం (బ్రాస్లెట్లు, గొలుసులు, 26 ఉంగరాలు), ఏకంగా 40 కిలోగ్రాముల వెండిని తీసుకుని రాత్రికి రాత్రే ఉడాయించాడు.

గురువారం ఉదయం నిద్రలేచిన సంతోష్ వర్మ కుటుంబం, ఇల్లు ఖాళీగా ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. పోగొట్టుకున్న నగలు, ఆస్తి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు ఉంటుందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.