📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

UP: యూపీలో ఊపందుకున్న రాజకీయాలు.. 40 మంది ఎమ్మెల్యేల సమావేశం

Author Icon By Vanipushpa
Updated: August 13, 2025 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూపీ(UP)లోని యోగి(Yogi) ప్రభుత్వంలో మార్పులు జరగనున్నాయా..అక్కడి బీజేపీ(BJP) పార్టీలో నేతలు మారనున్నారా అంటే…అవకాశం ఉందని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అక్కడి ఠాకూర్ వర్గానికి చెందిన నలభై మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కలవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. యూపీలో యోగి ప్రభుత్వం వచ్చాక,దాదాపు ఎనిమిది ఏళ్ళ తర్వాత ఠాకూర్ నేతలందరూ సమావేశం అవడం ఇదే మొదటి సారి. వీరందరూ లక్నో(Lucknow)లోని అవధ్ అనే హోటల్ లో కలిశారు. అంతే కాదు అందరికీ కలిపి కుటుంబ్ అనే పేరు తోనే ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టుకున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ జైపాల్ సింగ్ వ్యాప్, కుందర్కి ఎమ్మెల్యే ఠాకూర్ రాంవీర్ సింగ్ దీనికి ముఖ్య కారణమని తెలుస్తోంది. ఈ సమావేశానికి చెందిన పోస్టర్ లో కూడా వీరిద్దరి చిత్రాలే ప్రముఖంగా ఉన్నాయి.

UP: యూపీలో ఊపందుకున్న రాజకీయాలు.. 40 మంది ఎమ్మెల్యేల సమావేశం

పైకిమాత్రం ఇదొక కుటంబ సమావేశం
యూపీకి చెందిన నలభై మంది ఎమ్మెల్యేలు ఈ సమాశంలో పాల్గొన్నారు. ఇందులో ఒకరిద్దరు మినహా మిగతా వారందరూ ఠాకూర్ అంటూ యూపీలో క్షత్రియ వర్గానికి చెందిన వారు. ఇందులో ఎమ్మెల్యేలందరినీ ఘనంగా సత్కరించారు. దాంతో పాటూ మహారాణా ప్రతాప్, పెద్ద ఇత్తడి త్రిశూలాలను బహుమతిగా ఇచ్చారు. బయటకు చెప్పడానికి దీనిని ఠాకూర్ రాంవీర్ పుట్టిన రోజు అని చెబుతున్నారు. ఇదొక కుటంబ సమావేశం అంటున్నారు. కానీ వెనుక మరో పరమార్థం ఉందని అంటున్నారు.

యోగి నేతృత్వంలో అంతా సైలెంట్..
చాలా కాలంగా యూపీ రాజకీయాల్లో తమ బలాన్ని చాటుకోవాలని అక్కడి ఠాకూర్ లు భావిస్తున్నారు. వీళ్ళు చాలా మందే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లాంటి పదవుల్లో ఉన్నా పెద్దగా చెప్పుకోవడానికి లేదు అన్నట్టు ఉంది వారి పరిస్థితి. యోగి నేతృత్వంలో అంతా సైలెంట్ గా ఉండాల్సిందే. అయితే ఇప్పుడు మరికొన్ని రోజుల్లో యోగి మంత్రి వర్గ విస్తరణ చేసే అవకాశంతో పాటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకం కూడా చేపట్టనున్నారు. ఇవి ఠాకూర్ నేతలకే దగ్గాలన్నది వారి ఆశ. దాని కోసమే ఈ ప్రత్యేక సమావేశం అని చెబుతున్నారు. యూపీలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న మొదటిరోజునే ఈ మీటింగ్ అవడంతో..కన్ఫర్మ్ గా పదవుల కోసమే అని అంటున్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ‘కుటుంబ పరివార్’

దీంతో పాటూ ఠాకూర్ లందరూ ఏకమవ్వడం కూడా ముఖ్యమని వారు భావిస్తున్నారు. అందుకే లక్నోలో జరిగిన కుటుంబ్ మీటింగ్ కు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా హాజరయ్యారు. ఎస్పీ నుంచి బహిష్కరించబడిన ఎమ్మెల్సీ రాకేష్ ప్రతాప్ సింగ్, ఎమ్మెల్యే అభయ్ సింగ్, బీఎస్పీ ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే అభిజీత్ సంగ, ఎమ్మెల్సీ శైలేంద్ర ప్రతాప్ సింగ్ సహా 40 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ‘కుటుంబ పరివార్’ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్షత్రియ ఎమ్మెల్యేల సమావేశానికి బిజెపి ఎమ్మెల్సీ జైపాల్ సింగ్ వ్యాస్, కుందర్కి ఎమ్మెల్యే ఠాకూర్ రాంవీర్ సింగ్.. పిలుపునిచ్చినప్పటికీ..గౌరీగంజ్‌కు చెందిన ఎస్పీ తిరుగుబాటు ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్, గోసాయిగంజ్‌కు చెందిన అభయ్ సింగ్ తెర వెనుక ముఖ్యమైన పాత్ర పోషించారని చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్ జనాభా ఎంత?

అయినా గాని ఉత్తరప్రదేశ్ దాదాపు 18కోట్ల జనాభా కలిగి ఉంది. ఇది భారతదేశంలో పెద్దరాష్ట్రము మాత్రమే కాదు. ప్రపంచంలోనే జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద దేశాలు 5 మాత్రమే ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు?

యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. యోగి ఆదిత్యనాథ్ (జననం అజయ్ మోహన్ బిష్త్; 5 జూన్ 1972) ఒక భారతీయ హిందూ సన్యాసి మరియు రాజకీయ నాయకుడు, ఉత్తరప్రదేశ్ యొక్క 22వ మరియు ప్రస్తుత ముఖ్యమంత్రిగా 19 మార్చి 2017 నుండి పదవిలో ఉన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/young-scientists-must-move-forward-with-determination/national/529517/

India Politics political developments Telugu News up government UP MLAs meeting Uttar Pradesh politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.