📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Uttar Pradesh: అల్లుడితో పారిపోయిన అత్త..తల పట్టుకున్న పోలీసులు

Author Icon By Sharanya
Updated: April 17, 2025 • 2:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూపీలోని అలీఘర్‌ జిల్లాలో తన కూతురికి కాబోయే భర్తతో ఓ మహిళ పారిపోయిన వార్త దేశ వ్యప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల స్వప్న అనే మహిళ, తన కుమార్తెకు నిశ్చయించిన రాహుల్‌ అనే యువకుడితో కలిసి పారిపోయింది. ఈ సంఘటన నైతిక విలువలు, కుటుంబ బంధాలపై సుదీర్ఘ చర్చకు దారితీసింది. తాజాగా స్వప్న, రాహుల్ పోలీసుల ముందుకు వచ్చారు. ఇద్దరూ పారిపోవడానికి గల కారణాలను వారు వివరించారు.

స్వప్న వివరణ –

స్వప్న చెప్పిన ప్రకారం, తన భర్త బాగా తాగి వచ్చి తనను కొట్టేవాడని తన కూతురు కూడా తనతో తరచుగా గొడవలు పడేదని స్వప్న తెలిపింది. అందుకే రాహుల్ తో వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. తాను అతడినే పెళ్లి చేసుకుంటానని, అతనితోనే ఉంటానని తెలిపింది. ఆ గృహంలో నాకు చోటు లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుటుంబం చెప్పినట్లు తానేం బంగారం లేదా డబ్బు తీసుకెళ్లలేదని స్పష్టం చేసింది. నేను తీసుకెళ్లింది నా మొబైల్ ఫోన్, కేవలం రూ. 200 మాత్రమే అని వివరించింది. రాహుల్‌తో నాకు బంధం ఏర్పడింది. అతడే నాకు భద్రతగా అనిపించాడు. అందుకే అతడిని పెళ్లి చేసుకోవాలనిపించింది అని చెప్పింది.

రాహుల్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ, తనపై ఎలాంటి ప్రణయ భావనలు లేవని, కానీ స్వప్న బెదిరించిందని పేర్కొన్నాడు. బస్టాండ్‌కు రాకపోతే నేను ప్రాణాలు తీసుకుంటాను. ఆ మాటలు విని నేను భయపడ్డాను. తాము తొలుత లక్నోకు వెళ్లామని, అక్కడి నుంచి ముజఫర్‌నగర్ వెళ్లారని తెలిపాడు. పోలీసులు వెతుకుతున్నారన్న వార్త తెలిసిన వెంటనే మేము తిరిగి వచ్చేశాం. ఇప్పుడు తాను స్వప్నను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని రాహుల్ తెలిపాడు.

కుటుంబ స్పందన –

ఈ వ్యవహారంపై స్వప్న సోదరుడు తీవ్రంగా స్పందించాడు. ఆమెను ఇంటికి తిరిగి రానివ్వం. తీసుకెళ్లిన డబ్బు, బంగారం తిరిగి ఇచ్చేవరకు ఆమెను క్షమించం అని స్పష్టం చేశాడు. అంతేకాకుండా, స్వప్న తన భర్త చేతుల్లో వేధింపులకు గురైనట్టు చెప్పడం పూర్తిగా అసత్యమని, ఆమె బావ ఒక మంచివాడని చెప్పాడు. ఇది ఆమె కట్టుకథ. అసలు ఆమె గతంలో కూడా కొన్ని అనుమానాస్పద చర్యలు చేసింది. ఈసారి తల్లి గౌరవాన్ని తానే కాలరాస్తోంది అని ఆరోపణలు చేసాడు.

Read also: Uttar Pradesh : యూపీలో దారుణం.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం

#AligarhShockingIncident #ElopedWithSonInLaw #MotherInLawDrama #SwapnaRahulCase #UPPoliceShock #UttarPradesh Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.