ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా యాసిడ్ దాడులు సంచలనం రేపుతున్నాయి. తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడం జీర్ణించుకోలేకపోయాడో వ్యక్తి. పెళ్లికి కొన్ని రోజుల ముందు ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే
ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రీమాను ప్రేమించిన నిందితుడు రామ్ జనమ్ సింగ్ పటేల్ ఆమె వివాహం మరో వ్యక్తితో ఖాయం కావడాన్ని తట్టుకోలేకపోయాడు. నువ్వు నాకు దక్కకుంటే.. ఇంకెవ్వరికీ దక్కకూడదు గురువారం ఆమె బ్యాంకు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ఆమెపై యాసిడ్ పోశాడు. దాంతో ఆమె ముఖం, భుజం, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం 60 శాతం కాలిన గాయాలతో ఆమె అజంగఢ్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. రీమాకు మే 27న పెళ్లి కావాల్సి ఉంది. ఆ వివాహాన్ని ఆపే ఉద్దేశంతో అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
నిందితుల అరెస్టు – పోలీసులు చర్యలు
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించి, ప్రధాన నిందితుడు రామ్ జనమ్ సింగ్ పటేల్‌తో పాటు అతడికి సహాయం చేసిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దాడిలో ఉపయోగించిన బైక్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి ప్రాథమిక విచారణలో అతడు ఈ దాడిని రీమా పెళ్లిని ఆపేందుకు చేసానని ఒప్పుకున్నాడు. ఇదే తరహాలో గత నెలలో షాజహాన్‌పూర్ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఆమెతో పాటు ఇద్దరు కుమార్తెలపై యాసిడ్ పోసిన ఘటన దేశవ్యాప్తంగా విమర్శలకు తావిచ్చింది. ఇంకా ఆ ఘటనకు సమాజం నుండి న్యాయం లభించకముందే తాజాగా మౌలో ఈ సంఘటన మరొక మానవతా సంక్షోభానికి నిదర్శనంగా మారింది.
Read also: Madhya Pradesh: భార్యను హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టి.. చివరకు భర్త ఆత్మహత్య