📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Breaking News : కిందికి దూకి చావు అన్న భర్త.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన భార్య

Author Icon By Sai Kiran
Updated: September 4, 2025 • 5:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Breaking News : పెళ్లంటే భార్యాభర్తలు కలకాలం కలిసి జీవించేందుకు చేసుకున్న ఓ ఆప్యాయత ఒప్పందం. కానీ పెళ్లి అనంతరం అదనపు కట్నకానుకల కోసం శాడిస్టులా ప్రవర్తించే భర్తలు ఎందరో ఉన్నారు. వారి హింసలను తాళలేక, ఆత్మహత్యకు పాల్పడుతున్న వివాహితలు తక్కువేం కావు. అంతేకాక భార్యాభర్తల మధ్య ఉండాల్సిన (Breaking News)అవగాహన కొరవడి మనస్పర్థలతో విడిపోతున్న జంటల సంఖ్య పెరిగిపోతున్నది. ఉత్తరప్రదేశ్ లోని అలీబాగ్ గోండా ఏరియా దాకౌలి గ్రామంలో ఓ భర్త భార్యను దమ్ముంటే కిందికి దూకు అంటూ పదేపదే అరవడంతో ఆ భార్య దూకేసింది. అనంతరం ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

కట్నం కోసం హింసలు

సోను-అర్చనలు భర్త, భార్యలు. వీరికి ఆరు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఈ దంపతులకు నాలుగేళ్లు, రెండేళ్ల వయస్సు గల ఇద్దరు సంతానం. పెళ్లి సమయంలో అర్చన కుటుంబ సభ్యులు సోనూ కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చింది. అయినప్పటికీ మరో రూ.5 లక్షలు ఇవ్వాలని, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా గిఫ్ట్ ఇవ్వాలని వారు అర్చనను హింసించసాగారు. వారి కోరింది అర్చన కుటుంబం ఇవ్వలేకపోవడంతో తరచూ ఆమెను వేధిస్తూ ఉండేవారు. ఇందులో భాగంగా సోనూ తన భార్య అర్చనను కొట్టాడు. ఆమె ఏడుస్తూ బిల్డింగ్ పైకి ఎక్కి.. అక్కడి నుండి దూకుతానని బెదిరించింది. అదే సమయంలో దమ్ముంటే కిందికి దూకి చావు అని భర్త అనడంతో ఆమె అన్నంత పనిచేసింది.

ప్రాణాలతో బయటపడ్డ అర్చన

అర్చన కిందకు దూకిన తర్వాత భర్త సోనూ ఆమెను ఆసుపత్రికి తరలించాల్సి పోయి, తిరిగి ఆమెపై దాడి చేశాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్ఫోన్లో రికార్డు చేశాడు. దీంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. సెప్టెంబర్ 1న తన సోదరిని అత్తమామలు, భర్త ఆమెను చంపేస్తామని బెదిరించినట్లు తెలిసింది. అర్చన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితురాలు అర్చన వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అర్చన తీవ్రంగా గాయపడినా, ప్రాణాపాయస్థితి నుంచి బయటపడినట్లుగా వైద్యులు తెలిపారు.

Read also :

https://vaartha.com/drowned-rs-8-crore-ship-then-sank-in-the-sea/business/541279/

Archana Sonu case breaking news dowry harassment Breaking News in Telugu domestic violence Uttar Pradesh dowry deaths India Dowry Harassment India dowry torture India dowry-related suicide attempts Google News in Telugu husband abuses wife Latest News in Telugu Telugu News UP dowry violence Uttar Pradesh dowry case viral news UP wife jumps building viral video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.