Uttar Pradesh Crime: భార్య ఫోన్ లో ఆ ‘మూడు పదాలు’ చూసి భర్త షాక్

Read Time:  1 min
Uttar Pradesh Crime: భార్య ఫోన్ లో ఆ ‘మూడు పదాలు’ చూసి భర్త షాక్
FONT SIZE
GET APP

Uttar Pradesh Crime: ఉత్తరప్రదేశ్‌లో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్రమ సంబంధం ఎంతటి దారుణాలకు ఒడిగట్టేలా చేస్తుందో ఈ ఘటన నిరూపిస్తోంది. రాజ్‌కుమార్ అనే వ్యక్తిని, తన భార్య తనను చంపేందుకు సిద్ధమైందని తెలుసుకుని, ప్రాణ భయంతో తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Read Also: Anakapalli crime: మైనర్ బాలికపై అత్యాచారం.. పోలీసుల అదుపులోకి నిందితుడు

Uttar Pradesh Crime: Husband shocked to see those 'three words' on wife's phone
Uttar Pradesh Crime: Husband shocked to see those ‘three words’ on wife’s phone

ప్రాణాలు కాపాడుకునేందుకు వింత నిర్ణయం

బులంద్‌షహర్‌కు చెందిన ఓ మహిళ ప్రియుడితో వివాహేత సంబంధం పెట్టుకోవడంతో భర్తను వదిలించుకోవాలని ప్లాన్ చేసింది. ఆమె ఫోన్‌లో ‘సిమెంట్’, ‘బ్లూ డ్రమ్’ క్యాప్షన్లు, నగ్న చిత్రాలు ఉన్నాయి. ఆ సందేశాలు చూసిన భర్త రాజ్‌కుమార్ షాక్ అయ్యాడు. బిడ్డను పట్టించుకోకుండా, వంట చేయకుండా, తనను, తన సోదరులను చంపేస్తానని బెదిరిస్తున్న భార్యతో వేగలేక రాజ్‌ కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. కౌన్సెలింగ్‌లో కూడా ఆమె తన ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో రాజ్‌కుమార్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి, ఆమెను తన కళ్లముందే ప్రియుడికి అప్పగించి పంపించేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.