📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

News telugu: Uttar Pradesh: 15 రోజుల ఆడ శిశువును సజీవంగా పాతిపెట్టిన తల్లిదండ్రులు

Author Icon By Sharanya
Updated: September 16, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ (Shahjahanpur)జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘోరం మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నది. షాజహాన్‌పూర్ జిల్లా బహగుల్ నది వంతెన సమీపంలోని చెట్ల పొదల్లో ఆదివారం మధ్యాహ్నం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మేకలు మేపుతున్న ఒక కాపరి తన దృష్టిని ఏదో లేత శబ్దం ఆకర్షించింది. బిడ్డ ఏడుపు లాంటి ఓ స్థూలమైన స్వరం.. అక్కడి పొదల్లోకి వెళ్లి చూశాడు. మట్టిలోంచి ఓ చిన్న చేయి బయటకు వచ్చి కనిపించడంతో చలించిపోయిన అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

News telugu

చివరి శ్వాసలో చిన్నారి.. కానీ బతికే ఉన్నది!

పోలీసులు అక్కడకు చేరుకుని వెంటనే చిన్నారిని బయటకు తీశారు. చీమలు ముసురుకుని, రక్తస్రావం జరిగిన ఆమె శరీరాన్ని చూస్తే.. కొంచెం హృదయం ఉన్నవాడైనా కన్నీరు పెట్టుకుంటాడు. అయినా ఆశ ఉంది. చిన్నారి ఇంకా ఊపిరి పీలుస్తోంది. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు.

ఆడబిడ్డను బతికించేందుకు ప్రయత్నం..

చిన్నారి ప్రస్తుతం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో చికిత్స పొందుతోంది. వైద్యుల కథనం ప్రకారం, ఆమె వయసు సుమారుగా 10 నుంచి 15 రోజులు మధ్య ఉండొచ్చని, తీవ్రమైన బలహీనతతో పాటు చీమల కాట్ల వల్ల గాయాలు, ఎక్కువగా రక్తస్రావం కూడా ఉందని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేష్ కుమార్ ప్రకారం, చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ఆశ వదిలిపోలేదన్నారు.

నిందితుల కోసం గాలింపు..

పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించేందుకు బహగుల్ నది వంతెన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడినవారు తల్లిదండ్రులే కావచ్చని, పాపను సజీవంగానే అడుగు లోతులో పాతిపెట్టడం చూచి ఉద్దేశపూర్వకంగా చేసిన దురాక్రమంగా భావిస్తున్నారు. జైతిపూర్ పోలీస్ స్టేషన్ SHO గౌరవ్ త్యాగి మాట్లాడుతూ, బాధ్యులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?

ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా, గోడాపూర్ గ్రామం వద్ద బహగుల్ నది వంతెన సమీపంలో చోటు చేసుకుంది.

శిశువు పరిస్థితి ఎలా ఉంది?

15 రోజుల ఆడ పసికందుకు చీమలు కాట్లతో గాయాలు అయ్యాయి. రక్తస్రావం కూడా జరిగింది. ఆమెను ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కి తరలించి, ప్రస్తుతం నియోనాటల్ ఐసీయూ (NICU)లో చికిత్స అందిస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ap-liquor-scam-another-supplementary-chargesheet-in-the-liquor-scam/andhra-pradesh/548033/

baby buried alive Breaking News Child Abuse female infanticide girl child buried latest news Telugu News Uttar Pradesh incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.