📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Uttar Pradesh : కూరగాయలు కొనడానికి బయటికి వెళ్లిన బాలిక కిడ్నాప్..

Author Icon By Divya Vani M
Updated: May 5, 2025 • 8:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.కూరగాయల కోసం బయటకు వెళ్లిన 13 ఏళ్ల బాలికపై నరరూప రాక్షసులు అమానుషంగా వ్యవహరించారు.ఏప్రిల్ 26 సాయంత్రం, బాలిక ఇంటి నుంచి కూరగాయల కోసం బయలుదేరింది.ఆ సమయంలో ఓ కారు ఆమె దగ్గర ఆగింది.కారులో ఉన్న వ్యక్తి పేరు విష్ణు.అతను అడ్రస్ అడుగుతున్నట్టు నటించి, ఒక్కసారిగా బాలికను కారులోకి లాగేశాడు.బాలిక చెప్పిన ప్రకారం, కొద్దిదూరం వెళ్లిన తరువాత ఓ మెడికల్ షాప్ దగ్గర కారును ఆపాడు. నీటిలో మందులు కలిపి తాగించాడు.దాంతో స్పృహ కోల్పోయింది.తరువాత తనను ఒక హోటల్‌కు తీసుకెళ్లి, నకిలీ ఐడీతో రూమ్ తీసుకున్నాడు.ఆ రూమ్‌లోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.అతను మళ్లీ వచ్చే అవకాశం ఉందంటూ బెదిరించాడు.ఆ తర్వాత తన స్నేహితుడు నారాయణ్‌ను పిలిచి, మార్గ మధ్యంలో వదిలేశారని బాలిక చెప్పింది.

Uttar Pradesh కూరగాయలు కొనడానికి బయటికి వెళ్లిన బాలిక కిడ్నాప్..

అక్కడినుంచి సంజయ్ అనే వ్యక్తి వచ్చి, తన ఇంటికి తీసుకెళ్లాడని తెలిపింది.సంజయ్ తనకు కూల్‌డ్రింక్ ఇచ్చాడని, తాగిన వెంటనే స్పృహ కోల్పోయానని తెలిపింది.మరుసటి రోజు మెలకువ వచ్చాక తన ఫోన్ అడిగితే అందులో సిమ్ లేకపోయిందట.తర్వాత, తమ తమ్ముడితో పెళ్లి చేసుకోమని బలవంతం చేశారట. బాలిక పరిస్థితి చాలా విషాదంగా మారింది.బాధితురాలి తండ్రి శివరామ్ సింగ్ కుటుంబంతో ఢిల్లీలో ఉంటున్నాడు.కుమార్తె మాత్రం పల్లె గ్రామంలో తాతయ్యతో ఉంటుంది.“ఏప్రిల్ 26న మా అమ్మాయి కనిపించకుండా పోయింది. మే 1న ఆమె ఆచూకీ లభించింది,” అన్నారు శివరామ్.“ఈ లోపు ఆమెను ఎన్నో చోట్లకు తిప్పారు. మాకు ఇప్పుడు న్యాయం ఒక్కటే కావాలి. మా కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. మే 1న బాలికను రక్షించి, నిందితుడు విష్ణును అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read Also : Anurag Thakur : పాకిస్తాన్ పై బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఘాటు స్పందన

Attack on 13-year-old girl Child Safety in India Etawah Girl Abduction Case Latest Crime News in Telugu UP Police Investigation Uttar Pradesh Crime News Telugu Uttar Pradesh Kidnap and Rape Vishnu Kidnap Case Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.