Uttar Pradesh: ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి జీవిత ఖైదు

Read Time:  1 min
Uttar Pradesh: ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి జీవిత ఖైదు
FONT SIZE
GET APP

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో పదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. భూవివాదం నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన కేసులో ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని దోషులుగా తేలుస్తూ, వారికి జీవిత ఖైదు విధించింది.

ఈ దారుణ ఘటన సుమారు పదేళ్ల క్రితం సహరాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. భూమికి సంబంధించిన తగాదాల నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ములను అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ సాగింది. బాధితుల తరఫున సాక్ష్యాధారాలను పరిశీలించిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి వికాస్ గుప్తా, నిందితులపై నేరం రుజువైందని నిర్ధారించారు.

Read also: UP Fire Accident: నివాస గృహంలో చెలరేగిన మంటలు, ఆరుగురు సజీవదహనం!

Uttar Pradesh: ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి జీవిత ఖైదు
Uttar Pradesh: 13 people from the same family sentenced to life imprisonment

దోషులుగా తండ్రీకొడుకులు, మనవళ్లు

ఈ కేసులో శిక్ష పడిన వారి జాబితా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిందితుల్లో ఒకరైన సుబ్బా అనే వ్యక్తికి చెందిన నలుగురు కుమారులు మునవర్, ముస్తఫా, సనవర్, ఇస్తఖీమ్ తో పాటు, ముస్తఫా ఇద్దరు కుమారులు షౌకీన్, మోహ్సిన్ సహా మొత్తం 13 మందికి శిక్ష పడింది. వీరందరికీ యావజ్జీవ కారాగార శిక్షతో పాటు, మొత్తం కలిపి రూ. 10.73 లక్షల జరిమానా కూడా విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది దీపక్ సైనీ తెలిపారు.

సాధారణంగా హత్య కేసుల్లో ఒకరిద్దరికి శిక్ష పడటం చూస్తుంటాం. కానీ ఒకే కేసులో, ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వారు తండ్రి, కొడుకులు, మనవళ్లు దోషులుగా తేలడం వారందరికీ ఒకేసారి జీవిత ఖైదు పడటం యూపీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. న్యాయం ఆలస్యమైనా.. బాధితులకు సరైన తీర్పు లభించిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.