Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ బులంద్‌షహర్‌లో ఓ భర్త తన భార్య మొబైల్ ఫోన్‌లో మెసేజ్ చూసి షాకయ్యాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏకంగా భార్యను ఆమె ప్రియుడితో వెళ్లిపోవడానికి అంగీకరించాడు. ఉత్తరప్రదేశ్, బులంద్‌షహర్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తికి తన భార్య ప్రవర్తనపై గత కొంతకాలంగా అనుమానం ఉండేది. ఆమె తరచూ గొడవ పడుతూ ప్రియుడి దగ్గరకు వెళ్లేదని, చివరికి తన ఆరు నెలల పసిబిడ్డను కూడా వదిలేసి వెళ్ళిపోయేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఇటీవల ఆమె ఫోన్‌ను తనిఖీ చేసిన రాజ్‌కుమార్‌కు వెన్నులో వణుకు పుట్టే దృశ్యాలు కనిపించాయి. ఆమె ఫేస్‌బుక్‌లో హత్యలకు సంబంధించిన పోస్టులను చూస్తూ, రాజ్‌కుమార్ ఫోటోలను పెట్టి నీలిరంగు డ్రమ్, సిమెంట్ అనే క్యాప్షన్లు రాయడం గమనించాడు.
Read Also : Air India, AI 185: 8 గంటల గాలిలో ప్రయాణం.. చివరకు ఢిల్లీలోనే ల్యాండింగ్

Uttar Pradesh: ప్రియుడికి అప్పగించి ఊపిరి పీల్చుకున్న భర్త
నిజానికి, 2025లో మీరట్‌లో జరిగిన ఒక దారుణ హత్యను ఈ ప్లాన్ గుర్తు చేస్తోంది. అక్కడ ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపి, బాడీని ముక్కలుగా కోసి సిమెంట్ నింపిన నీలిరంగు డ్రమ్ములో దాచిపెట్టింది. రాజ్‌కుమార్ భార్య కూడా సరిగ్గా అదే ప్లాన్ చేస్తూ, గొడవ జరిగినప్పుడల్లా “నిన్ను కూడా డ్రమ్ములో ప్యాక్ చేస్తాను” అని బెదిరించేది. తనతో పాటు తన ముగ్గురు సోదరులను కూడా చంపేస్తానని ఆమె హెచ్చరించడంతో రాజ్‌కుమార్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.
ఈ బెదిరింపులు మితిమీరడంతో రాజ్‌కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. కౌన్సెలింగ్‌లో కూడా ఆ మహిళ తన ప్రియుడితోనే ఉంటానని కరాఖండిగా చెప్పేసింది. తాను బతికుంటేనే తన బిడ్డకు తండ్రిగా అండగా ఉండగలనని భావించిన రాజ్‌కుమార్, ఏమాత్రం ఆలోచించకుండా ఆమె ప్రియుడిని పిలిపించి భార్యను అతడికి అప్పగించాడు. తన ప్రాణాలు పోకుండా గండం గడిచినందుకు రాజ్‌కుమార్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాడు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :