📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Aadhaar Card : కొత్త ఆధార్‌ యాప్‌ వాడడం చాల ఈజీ

Author Icon By Sudheer
Updated: April 19, 2025 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మన నిత్య జీవితంలో ఆధార్ కార్డు ప్రాముఖ్యత ఎంతగానో ఉంది. ప్రభుత్వ పథకాలు పొందడం నుంచి, బ్యాంకింగ్, విద్యా సంస్థలు, గవర్న్మెంట్ కార్యాలయాలు వంటి ప్రతి రంగంలో ఆధార్ తప్పనిసరి అయింది. తాజాగా, ఆధార్ వినియోగాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్‌కు సంబంధించిన కొత్త యాప్‌ను తీసుకురానుంది. ఈ యాప్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అభివృద్ధి చేస్తోంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకారం, ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్‌ అవుతుంది. ఫేస్ రికగ్నిషన్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలతో ఈ యాప్‌ పని చేస్తుంది.

యాప్ ద్వారా సెల్ఫీ తీసి UIDAI డేటాబేస్‌తో వేరిఫై

ఈ ఆధార్ యాప్ ద్వారా వ్యక్తిగత గుర్తింపును వేగంగా, సురక్షితంగా ధృవీకరించుకోవచ్చు. దీనిలో, ముందుగా అవసరమైన ప్రదేశంలో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి, తర్వాత యాప్ ద్వారా సెల్ఫీ తీసి UIDAI డేటాబేస్‌తో వేరిఫై చేస్తారు. ఇలా చేయడం వల్ల ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా పోతుంది. అవసరమైన డేటా మాత్రమే షేర్ కావడం వల్ల డేటా ప్రైవసీ కూడా బాగానే రక్షితమవుతుంది. ఈ విధానం ఫేక్ డాక్యుమెంట్లను గుర్తించడంలో, సైబర్ మోసాల నివారణలో సహాయపడుతుంది.

ఆధార్ యాప్ బీటా వెర్షన్‌లో టెస్టింగ్

ప్రస్తుతం ఈ ఆధార్ యాప్ బీటా వెర్షన్‌లో టెస్టింగ్ దశలో ఉంది. కనుక ఇది ఇంకా గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఎవరు ఏమైనా కాల్ ద్వారా లేదా లింక్ పంపి యాప్ డౌన్‌లోడ్ చేయమంటే జాగ్రత్తగా ఉండాలి. అధికారికంగా UIDAI ద్వారా విడుదలైనప్పుడే మాత్రమే యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. డిజిటల్ ఆధార్ వాడకాన్ని మరింత సురక్షితంగా, సులభంగా మార్చే దిశగా ఈ యాప్‌ ఒక కీలక అడుగుగా నిలవనుంది.

aadhar card app AadharCard

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.