📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

America: ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ నివేదిక

Author Icon By Vanipushpa
Updated: March 18, 2026 • 1:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (RSS), భారత నిఘా సంస్థ ‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్’ (రా)ను నిషేధించాలని సూచిస్తూ అమెరికాకు చెందిన యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్(యూఎస్‌సీఐఆర్ఎఫ్) (USCIRF) ఇచ్చిన నివేదికను భారత ప్రభుత్వం తీవ్ర విమర్శలతో తిరస్కరించింది. ఈ నివేదిక పక్షపాతంతో కూడుకున్నదని, దురుద్దేశపూర్వకమైనదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ఆర్ఎస్ఎస్’పై నిషేధం, ‘రా’పై ఆంక్షలకు అమెరికా సంస్థ సిఫారసు. మరోవైపు, ఈ నివేదికపై తాము ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదని దిల్లీలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ‘కేశవ్ కుంజ్’ మీడియా విభాగం తెలిపింది. ఆర్ఎస్ఎస్ భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ ఆంబేకర్‌ను దీనిపై సంప్రదించగా ఆయన సమాధానం ఇవ్వలేదు. గతంలోనూ యూఎస్‌సీఐఆర్ఎఫ్ మత స్వేచ్ఛ నివేదికలను భారత్ తిరస్కరించింది. తాజా నివేదిక కూడా దీర్ఘకాలంగా కొనసాగుతున్న పక్షపాత ధోరణిలో భాగమేనని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.

Read Also: Paternity Leave: పితృత్వ సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

America: US Commission on International Religions report calls for banning RSS

భారత్‌కు అమెరికా అందించే భద్రత సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం

భారత్‌ను ‘ప్రత్యేక ఆందోళనకరమైన దేశం’ (సీపీసీ)గా గుర్తించాలని యూఎస్‌సీఐఆర్ఎఫ్ తన తాజా నివేదికలో అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది. భారత్‌లో మత స్వేచ్ఛ నిరంతరం క్షీణిస్తోందని ఆ సంస్థ అభిప్రాయపడింది. భారత నిఘా సంస్థ ‘రా’, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లపై మత స్వేచ్ఛ ఉల్లంఘనకు సంబంధించి యూఎస్‌సీఐఆర్ఎఫ్ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘రా’, ఆర్ఎస్ఎస్‌లపై లక్షిత ఆంక్షలు విధించాలని, వాటికి సంబంధించిన వ్యక్తులు, సంస్థల ఆస్తులను ఫ్రీజ్ చేయాలని, వారి అమెరికా ప్రవేశాన్ని నిషేధించాలని కోరింది. భారత్‌కు అమెరికా అందించే భద్రత సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం అక్కడి మత స్వేచ్ఛ పరిస్థితుల అనుగుణంగా ఉండాలని, అలాగే ‘ఆర్మ్స్ ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ యాక్ట్’ కింద భారత్‌కు ఆయుధాల విక్రయాలను నిలిపివేయాలని కూడా ఈ నివేదికలో సూచించింది. అయితే, ఇవి కేవలం సిఫారసులు మాత్రమే, వాటిని అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించలేదు.

ఏమిటీ యూఎస్‌సీఐఆర్ఎఫ్?

యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం (యూఎస్‌సీఐఆర్ఎఫ్ ) అనేది అమెరికాలోని రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలకు చెందిన కొందరు సభ్యులతో కూడిన ఒక స్వతంత్ర కమిషన్, ప్రభుత్వ సంస్థ. అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం కింద 1998లో ఈ కమిషన్‌ను స్థాపించారు. ఈ ఫెడరల్ ప్రభుత్వ సంస్థ అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుంది. యూఎస్‌సీఐఆర్ఎఫ్ ఏటా అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదికను రూపొందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛను పెంపొందించేందుకు అమెరికా అధ్యక్షుడు, ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కాంగ్రెస్‌లకు విధానపరమైన సిఫారసులు చేస్తుంది. మత స్వేచ్ఛకు సంబంధించి నిరంతర, తీవ్రమైన, వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరుగుతున్న దేశాలను ఈ కమిషన్ గుర్తిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

India Country of Particular Concern MEA Rejects US Report Rashtriya Swayamsevak Sangh News Sanctions on RSS and RAW Telugu News Paper Telugu News Today US Commission on International Religious Freedom USCIRF Report 2026 India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.