📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

US Student Visa : ఆరు వేల మంది విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు

Author Icon By Sudha
Updated: August 20, 2025 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం విదేశీ విద్యార్థులను రాచి రంపాన పెడుతున్నది.నిబంధనల ఉల్లంఘన పేరుతో వారి వీసాలను అడ్డగోలుగా రద్దు చేస్తున్నది. అలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 6 వేల మందికిపైగా విదేశీ విద్యార్థుల వీసాలను(US Student Visa ) రద్దు చేసింది. వారిలో 4 వేల మంది చట్టాల ఉల్లంఘన, డ్రంకెన్‌ డ్రైవ్‌, దాడులు, దోపిడీ లాంటి నేరాలకు పాల్పడినట్టు పేర్కొన్నది. ‘హమాస్‌’ ఉగ్రవాద సంస్థకు నిధులు సమీకరిస్తున్నందుకు (For fundraising)ఇమిగ్రేషన్‌ అండ్‌ నేషనాలిటీ చట్టం (ఐఎన్‌ఏ)లోని నిబంధనల కింద మరో 200-300 మంది విదేశీ విద్యార్థుల వీసాలను(US Student Visa ) రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

US Student Visa : ఆరు వేల మంది విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు

ఈ సంఖ్యలు అన్ని క్యాటగిరీల్లో పెరుగుతున్న వీసా రద్దుల్లో(US Student Visa ) కేవలం ఒక భాగం మాత్రమే. అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకు అన్ని క్యాటగిరీల్లో కలిపి దాదాపు 40 వేల వీసాలు రద్దయ్యాయి. ఇవి అంతకుముందు జో బైడెన్‌ ప్రభుత్వ హయాంలో రద్దయిన 16 వేల వీసాల కంటే చాలా అధికం. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఉన్నత విద్యావ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించే పనిలో పడిన ట్రంప్‌.. ప్రధాన విశ్వవిద్యాలయాలను దృష్టిలో పెట్టుకుని విధానపరమైన మార్పులు చేపట్టారు. కీలక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు కేటాయించిన నిధుల్లో భారీగా కోత విధించడంతోపాటు వర్సిటీ క్యాంపస్‌లలో ఆందోళనలకు దిగే విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.

యుఎస్ స్టూడెంట్ వీసా ప్రాసెస్?

గుర్తింపు పొందిన సంస్థ మీ దరఖాస్తును అంగీకరించి, మీకు ఫారమ్ I-20 జారీ చేసిన తర్వాత మీరు ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విశ్వవిద్యాలయం అందించే ఫారమ్ I-20 మీ ప్రోగ్రామ్ యొక్క వ్యవధిని నిర్ణయిస్తుంది మరియు గడువు తేదీని జాబితా చేస్తుంది. ఇది మీరు మీ డిగ్రీని సంపాదించడానికి మరియు USలో ఎంతకాలం ఉండాలో నిర్ణయిస్తుంది.

ఎఫ్ 1 వర్సెస్ ఎఫ్ 2 స్టూడెంట్ వీసా?

F2 వీసాదారులు మరిన్ని పరిమితులను ఎదుర్కొంటున్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లింపు ఉద్యోగంలో పాల్గొనలేరు, అయినప్పటికీ వారు స్వచ్ఛందంగా పనిచేయవచ్చు. అదనంగా, F1 వీసాదారులు పూర్తి-సమయం విద్యా కార్యక్రమాలలో నమోదు చేసుకోవచ్చు, అయితే F2 ఆధారపడినవారు పార్ట్-టైమ్ అధ్యయనాలు లేదా వృత్తిపరమైన కోర్సులలో మాత్రమే పాల్గొనగలరు .

స్టూడెంట్ వీసాలు ఎన్ని రకాలు?

ప్రధానంగా రెండు రకాల అంతర్జాతీయ వీసాలు ఉన్నాయి: స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక . మూడు నెలల కంటే తక్కువ వ్యవధి గల కోర్సులను అభ్యసించే విద్యార్థులకు మంజూరు చేయబడిన విద్యార్థి వీసాలు స్వల్పకాలిక వీసాల వర్గంలోకి వస్తాయి. మూడు నెలల కంటే ఎక్కువ కాలం నడిచే కోర్సులను అభ్యసించే వారికి, గ్రాడ్యుయేట్ వీసాలు లేదా దీర్ఘకాలిక వీసాలు వర్తిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/trumps-religious-fervor-increased-after-assassination-attempt/international/532955/

Breaking News Education Abroad International Students latest news Telugu News US Immigration US student visa visa cancellation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.