📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Green card: పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

Author Icon By Vanipushpa
Updated: March 17, 2026 • 3:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో స్థిరపడాలనేది లక్షలాది మంది భారతీయుల కల. కానీ, ఆ కల నెరవేరడం ఇప్పుడు దాదాపు అసాధ్యంగా మారుతోంది. అమెరికా శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డ్ (Green Card) లేదా పర్మినెంట్ వీసా కోసం భారతీయులు ఏకంగా 134 ఏళ్లు వేచి చూడాల్సి వస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో పాకిస్థాన్ లేదా సోమాలియా వంటి దేశాల నుంచి వచ్చే వారికి కేవలం రెండేళ్లలోనే గ్రీన్ కార్డ్ లభిస్తుండటం చాలా వింతగా అనిపించడమే కాకుండా పెద్ద చర్చకు దారితీస్తోంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం.. ఏ ఒక్క దేశానికి కూడా ఏడాదికి ఇచ్చే మొత్తం ఎంప్లాయ్‌మెంట్ గ్రీన్ కార్డ్స్‌లో 7 శాతం కంటే ఎక్కువ కోటా ఇవ్వకూడదు. దీనినే ‘పర్-కంట్రీ క్యాప్’ (Per-country cap) అంటారు. భారత్ నుంచి ఏటా వేలాది మంది నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణులు, ఇంజనీర్లు అమెరికా వెళ్తుంటారు. కానీ, ఐస్ ల్యాండ్ లాంటి చిన్న దేశానికి ఎంత కోటా ఉందో, భారత్ కు కూడా అంతే కోటా ఉండటంతో దరఖాస్తులన్నీ పెండింగ్‌ లో పడిపోతున్నాయి.

Read Also: Koil Alwar Tirumanjanam in Tirumala: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం లో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

Green card: 2 years for Pakistanis.. 134 years for us..

కేటో ఇన్‌స్టిట్యూట్ (Cato Institute) నివేదిక ప్రకారం..

ప్రస్తుతం అమెరికాలో దాదాపు 11 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డ్ క్యూలో ఉన్నారు. ఇతర దేశాల వారు సులభంగా గ్రీన్ కార్డ్ పొందుతుంటే.. నైపుణ్యం ఉన్న భారతీయులు మాత్రం దశాబ్దాల తరబడి తాత్కాలిక వీసాలపైనే గడపాల్సి వస్తోంది. EB-2, EB-3 వంటి విభాగాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఎదురుచూపులు మరింత ఎక్కువగా ఉన్నాయి. 4 లక్షల మంది గ్రీన్ కార్డ్ రాకుండానే..? ఒక భయంకరమైన నిజం బయటపడింది. ప్రస్తుతం ఉన్న వెయిటింగ్ లిస్ట్ ప్రకారం చూస్తే, సుమారు 4.24 లక్షల మంది భారతీయులు తమకు గ్రీన్ కార్డు (Green Card) రాకముందే మరణించే అవకాశం ఉంది. అంటే వారి దరఖాస్తు ప్రాసెస్ అయ్యే సమయానికి వారు బతికి ఉండకపోవచ్చు. 2023 లో నమోదైన మొత్తం 18 లక్షల పెండింగ్ దరఖాస్తుల్లో 68 శాతం భారతీయులవే కావడం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

employment based green card Green Card Backlog H1B visa India vs Pakistan Green Card Indian IT professionals Latest News in Telugu Telugu News Today US Green Card US Immigration Policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.