📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Uri Sector: ఉరిలో ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

Author Icon By Anusha
Updated: March 15, 2026 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Uri Sector: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్‌లో భారత సైన్యం మరోసారి తన పరాక్రమాన్ని చాటింది. ఆదివారం (మార్చి 15) సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాకిస్తానీ ఉగ్రవాదిని భద్రతా దళాలు విజయవంతంగా మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసుల సమన్వయంతో సాగిన ఈ జాయింట్ ఆపరేషన్, ఉగ్రవాదుల కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టింది.

Read Also: Bangalore Crime: ప్రియురాలిని కేబుల్ వైర్‌తో గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

నిఘా సమాచారంతో మెరుపు దాడి

బుఖారా ప్రాంతంలో నిఘా పెంచిన భద్రతా దళాలకు.. ఉగ్రవాదుల ఎదురుపడ్డారు. ఫలితంగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక పాకిస్తాన్ ఉగ్రవాది మరణించాడు. ఉగ్రవాది సరిహద్దు దాటి చొరబడటానికి ప్రయత్నిస్తున్నట్లు భద్రతా సంస్థలు చెబుతున్నాయి. సమీపంలో ఇతర ఉగ్రవాదులు ఎవరూ దాక్కుని లేరని నిర్ధారించుకోవడానికి ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఈ ఆపరేషన్ సరిహద్దు గుండా చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలో చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయని అధికారులు తెలిపారు.

Uri Sector: Infiltration attempt foiled in Uri: Terrorist killed!

ఈ ఆపరేషన్‌లో ఒక అనుమానిత ఉగ్రవాది మృతి చెందగా, అతని సహచరుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మార్చి 10, మంగళవారం ఈ సంఘటన జరిగిందని సైన్యం తెలిపింది. సరిహద్దు దాటి కొంతమంది ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించవచ్చని భారత సైన్యానికి నిఘా సమాచారం అందింది. దీని తర్వాత, సైన్యం ఆ ప్రాంతంలో నిఘా, సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేసింది. జమ్మూకు చెందిన రక్షణ ప్రతినిధి మాట్లాడుతూ, మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఝంగర్ సమీపంలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు కనిపించారని చెప్పారు.

ఈ ప్రాంతం నౌషెరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖకు దగ్గరగా ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యారని తెలిపారు.భద్రతా దళాలు వారిని ఆపడానికి ప్రయత్నించాయి. దీంతో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్ సమయంలో ఒక అనుమానిత ఉగ్రవాది మృతి చెందాడు. రెండవ ఉగ్రవాదిని గుర్తించడానికి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇతర చొరబాటుదారులు ఎవరూ దాక్కున్నారని నిర్ధారించుకోవడానికి భద్రతా దళాలు ఆ ప్రాంతమంతా సోదాలు నిర్వహిస్తున్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Baramulla encounter jammu kashmir Uri Sector

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.