మనదేశానికి రాజ్యాంగం (Constitution) ఎంత ముఖ్యమో యూపిఎస్ సి కూడా అంతే ముఖ్యం. నేడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్ సి) (UPSC) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శతవార్షికోత్స వాలు ప్రారంభమయ్యాయి. రాజ్యాంగ దినోత్సవం సమయానికే ఈ వేడుకలను రెండురోజులపాటు నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలో(New Delhi) భారత మండపంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు.
Read also : DK Shivakumar: కర్ణాటకలో సీఎం మార్పుపై తేల్చని కాంగ్రెస్ అధిష్ఠానం
ఈ సమావేశాల్లో యూపీఎస్సీ ప్రస్తుత చైర్మన్, సభ్యులు మాత్రమేకాకుండా, అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, మాజీ చైర్మన్లు, మాజీ సభ్యులు, సీనియర్ అధికారులు, నిపుణులు పాల్గొంటున్నారు. శతవార్షికోత్స వాల నేపథ్యంలో ఈ రెండుదినాల సమావేశాలు ఒకవిధంగా దేశవాప్తంగా నియామక వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకునే కీలక చర్యల్లో భాగంగా భావిస్తున్నారు.
సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు..
సామాన్య ప్రజలకు పబ్లిక్ సర్వీస్ (Public service) కమిషన్లు ఇంకా సరళంగా, సులభంగా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండేందుకు ఏవిధమైన మార్పులు కావాలి అనే దానిపై లోతైన చర్చ జరగనుంది. పబ్లిక్ సేవలకు చేరాలనుకు అభ్యర్థులకు మరింత న్యాయం జరిగేలా, వ్యవస్థ మరింత ఆధునికంగా ఉండేలా చేయడం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం.
ఈ చింతన్ సమావేశాల్లో పాలనాపరమైన సేవలు, నైతకత, పారదర్శకత, సుపరిపాలన వంటి అంశాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి టెక్నాలజీ వేగంగా మూరుతున్న నేపధ్యంలో సాంకేతిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, పరీక్షా విధానాల్లో లేదా ఎంపిక ప్రక్రియల్లో వాటి ప్రభావం ఎంత ఉంటుంది అనే విషయాలు కూడా ఇందులో చర్చకు వస్తాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :