📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

UP: వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం

Author Icon By Pooja
Updated: December 26, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్నోలో రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్(UP) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. ప్రేరణా స్థల్ ప్రాంగణంలో భారతమాత విగ్రహానికి ప్రధాని నివాళులు అర్పించారు.

Read Also: Mysore Explosion: అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

UP: Prime Minister Modi inaugurates Prerna Sthal on the occasion of Vajpayee’s birth anniversary.

రూ.230 కోట్లతో నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్

రూ.230 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌ను అత్యంత విశాలంగా రూపొందించారు. ఇక్కడ అటల్ బిహారీ వాజ్‌పేయి, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీల 65 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు.

బీజేపీ చరిత్రను ప్రతిబింబించే మ్యూజియం ప్రారంభం

ప్రేరణా స్థల్‌లో ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందులో భారతీయ జనతా పార్టీ చరిత్రకు సంబంధించిన కీలక ఘట్టాలు, మహనీయుల సేవలను వివరించే అంశాలను పొందుపరిచారు.

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలను సాకారం చేశామని ప్రధాని మోదీ అన్నారు. కశ్మీర్‌లో భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమందిని పేదరికం నుంచి బయటపడేశామని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌పై విమర్శలు.. బీజేపీ పాలనపై ప్రశంసలు

యూపీలో(UP) డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేశామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు చివరి వ్యక్తి వరకు చేరేలా అమలు చేస్తున్నామని మోదీ తెలిపారు. గతంలో ఒకే కుటుంబాన్ని కేంద్రంగా చేసుకుని పథకాలు రూపొందించారని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం మాత్రం దేశానికి సేవ చేసిన మహనీయులను గౌరవిస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BJP News Google News in Telugu Latest News in Telugu Telugu Political News Uttar Pradesh News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.