📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

UP road accident : యూపీలో పొగమంచు బీభత్సం, వరుస ప్రమాదాలు షాక్!

Author Icon By Sai Kiran
Updated: January 18, 2026 • 1:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

UP road accident : ఉత్తర భారతదేశంలో ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ–లఖ్నవూ జాతీయ రహదారి (NH-9)పై షాహ్వాజ్‌పూర్ దోర్ గ్రామ సమీపంలో పొగమంచు కారణంగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో వరుసగా సుమారు 10 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి.

ఈ ప్రమాదంలో 12 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తర్వాత పోలీసులు క్రేన్ల (UP road accident) సహాయంతో దెబ్బతిన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. దట్టమైన పొగమంచే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Read Also: HYD: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సక్సెస్ మీట్

ఇదిలా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ఉత్తర రాష్ట్రాల్లో కూడా పొగమంచు తీవ్రంగా ఉంది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 430 మార్కును దాటడంతో పరిస్థితి మరింత దిగజారింది. కాలుష్య నియంత్రణ కోసం జీఆర్‌ఏపీ-4 నిబంధనలను అమలు చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో విజిబిలిటీ చాలా ప్రాంతాల్లో జీరో స్థాయికి చేరింది.

పాలెం, అమృత్‌సర్‌, ఆగ్రా, గ్వాలియర్‌, ప్రయాగ్‌రాజ్‌, జైసల్మేర్‌ విమానాశ్రయాల్లో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోవడంతో పలు విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

amroha accident news Breaking News in Telugu delhi lucknow highway crash dense fog accident Google News in Telugu Latest News in Telugu nh9 accident north india fog Telugu News up breaking news UP Road Accident visibility zero fog winter fog news india

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.