📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

UP Crime: సిస్టర్స్ సూసైడ్ కేసులో విస్తుగొలిపే విషయాలు

Author Icon By Saritha
Updated: February 5, 2026 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌లోని (UP Crime) ఘజియాబాద్ సిస్టర్స్ సూసైడ్, కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. కొరియన్ ఆన్‌లైన్ గేమ్‌కు (Korean online game) బానిసైన నిషిక (16), ప్రాచి (14), పఖీ (12) బుధవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లకు కొరియన్ అంటే చాలా ఇష్టమని, సోషల్ మీడియాలో తమ ఖాతాలను కూడా కొరియన్ పేర్లతో తెరిచినట్లు పోలీసులు గుర్తించారు.

Read Also: Elon musk: కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

కొరియన్ అంటే ప్రాణం

ఆత్మహత్యకు పది రోజుల ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తండ్రి డిలీట్ చేశారు. వీరు ముగ్గురు మరియా, అలీజా, సిండీ అనే కొరియన్ పేర్లతో ఖాతాలను తెరిచారు. (UP Crime) ఇంట్లో కూడా వారు అవే పేర్లతో పిలుచుకునేవారు. ఇటీవల తండ్రి ఆ ఖాతాలను డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.వారి వద్ద నుంచి తండ్రి మొబైల్ ఫోన్లు కూడా తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయడం, తమ వద్ద ఫోన్లు లేకుండా చేయడంతో వారు ముగ్గురు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారని పోలీసులు తెలిపారు. తమకు కొరియన్ అంటే ప్రాణమని, ఈ విషయం మీకు అర్థం కాదని, ఇక్కడి వాళ్లను మేం పెళ్లి చేసుకోలేమని డైరీలో ముగ్గురు అమ్మాయిలు రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Ghaziabad Korean Online Game Latest News in Telugu Sisters Suicide Social Media Teen Suicide Telugu News Uttar Pradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.