UP Crime: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో నమ్మకద్రోహానికి పరాకాష్ట అనదగ్గ ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన వద్ద పనిచేస్తున్న 28 ఏళ్ల యువకుడు, 41 ఏళ్ల మహిళా యజమానిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు అనారోగ్యంతో ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
Read Also: Priyanka Gandhi: ఇది అత్యంత హేయమైన చర్య
మందుల ప్రభావం.. గాఢ నిద్రలో ఉండగా అఘాయిత్యం
బాధితురాలు గత కొంతకాలంగా డిప్రెషన్ (Depression) సమస్యతో బాధపడుతోంది. చికిత్సలో భాగంగా ఆమె తీసుకునే మందుల ప్రభావం వల్ల రాత్రి సమయాల్లో గాఢ నిద్రలోకి వెళ్లేది. దీనిని గమనించిన నిందితుడు, ఆమె స్పృహలో లేని సమయాన్ని చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. మత్తులో ఉండటం వల్ల బాధితురాలికి విషయం తెలిసేది కాదు. ఒకరోజు బాధితురాలు మందులు తీసుకోకుండా మెలకువగా ఉండటంతో ఈ దారుణం బయటపడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: