UP Crime: నిద్రిస్తున్న మహిళా యజమానిపై పనిమనిషి అఘాయిత్యం

Read Time:  1 min
UP Crime: నిద్రిస్తున్న మహిళా యజమానిపై పనిమనిషి అఘాయిత్యం
FONT SIZE
GET APP

UP Crime: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో నమ్మకద్రోహానికి పరాకాష్ట అనదగ్గ ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన వద్ద పనిచేస్తున్న 28 ఏళ్ల యువకుడు, 41 ఏళ్ల మహిళా యజమానిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు అనారోగ్యంతో ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Read Also: Priyanka Gandhi: ఇది అత్యంత హేయమైన చర్య

UP Crime: Maid assaults sleeping employer
UP Crime: Maid assaults sleeping employer

మందుల ప్రభావం.. గాఢ నిద్రలో ఉండగా అఘాయిత్యం

బాధితురాలు గత కొంతకాలంగా డిప్రెషన్ (Depression) సమస్యతో బాధపడుతోంది. చికిత్సలో భాగంగా ఆమె తీసుకునే మందుల ప్రభావం వల్ల రాత్రి సమయాల్లో గాఢ నిద్రలోకి వెళ్లేది. దీనిని గమనించిన నిందితుడు, ఆమె స్పృహలో లేని సమయాన్ని చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. మత్తులో ఉండటం వల్ల బాధితురాలికి విషయం తెలిసేది కాదు. ఒకరోజు బాధితురాలు మందులు తీసుకోకుండా మెలకువగా ఉండటంతో ఈ దారుణం బయటపడింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.