📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Rain : జూన్ 14 వరకూ ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

Author Icon By Divya Vani M
Updated: June 8, 2025 • 6:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత వాతావరణ శాఖ (India Meteorological Department) (IMD) జూన్ 8 నుంచి 14 వరకు వర్షాలకు సంబంధించి కీలక హెచ్చరిక విడుదల చేసింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, మెరుపులు నమోదవుతాయని పేర్కొంది.జూన్ 11 నుంచి 14 వరకు అరుణాచల్ ప్రదేశ్‌, (Arunachal Pradesh) అసోం, మేఘాలయల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. జూన్ 10 నుంచి 13 వరకు నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాంలలో వర్షాలు పడొచ్చు. త్రిపురలో జూన్ 8 నుంచి 12 వరకు తుపాను గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.కేరళ, మహే, తీర రాష్ట్రాలైన కర్ణాటక, లక్షద్వీప్‌లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. జూన్ 10 నుంచి 14 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, తూర్పు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు నమోదవుతాయని IMD పేర్కొంది.

కెరళ-కర్ణాటకలో భారీ వర్ష సూచన

జూన్ 13, 14 తేదీల్లో కేరళ, కర్ణాటక, లక్షద్వీప్‌లలో అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. జూన్ 12న కర్ణాటకలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.బిహార్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, గంగా తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు, మెరుపులు ఉండే అవకాశం ఉంది. జూన్ 11, 12 తేదీల్లో బిహార్‌, విదర్భలో గాలుల వేగం 70 కి.మీ. వరకు ఉండొచ్చని అంచనా. జూన్ 9న అండమాన్, నికోబార్‌ దీవుల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు.

ఉత్తర భారతంలో ఎండ తీవ్రత

రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో జూన్ 8 నుంచి 11 వరకు తీవ్రమైన ఎండలు ఉండే సూచనలు ఉన్నాయి. జూన్ 9న పశ్చిమ రాజస్థాన్‌లో ఉష్ణోగ్రతలు మరింత పెరగొచ్చని పేర్కొన్నారు. పంజాబ్‌, హర్యానా, ఢిల్లీలో జూన్ 9, 10 తేదీల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గకపోవచ్చని హెచ్చరించారు.జూన్ 11 నుంచి 14 వరకు ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో తక్కువ స్థాయిలో వర్షాలు పడొచ్చని తెలిపారు.

పశ్చిమ భారత వాతావరణం

కొంకణ్‌, గోవా, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడాలో జూన్ 8 నుంచి 14 వరకూ వర్షాలు కొనసాగుతాయి. జూన్ 12 నుంచి 14 మధ్య అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది.వాయవ్య భారతదేశంలో వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలవరకు పెరగవచ్చని IMD తెలిపింది. దీని ప్రభావంగా వేడిగాలులు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

Read Also : Rinku Singh: ఘనంగా రింకూ సింగ్ నిశ్చితార్థం

heatwave alert India heavy rain warning IMD rain alert IMD regional forecast India weather update June 2025 weather forecast

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.