📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Ahmedabad Plane Crash : ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Author Icon By Sudheer
Updated: June 12, 2025 • 7:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాద (Ahmedabad Plane Crash) ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) విజయవాడ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడికి చేరిన వెంటనే ఆయన ప్రత్యక్షంగా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటన స్థితిగతులపై అధికారుల నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని భరోసా

ప్రమాద స్థలానికి వెళ్లిన రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఈ దుర్ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా మద్దతుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వెంటనే సహాయక బృందాలు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక దళం రంగంలోకి దిగడం వల్ల మరిన్ని ప్రాణనష్టాలు తలెత్తకుండా నివారించగలిగామని పేర్కొన్నారు.

అమిత్ షా పరిశీలన, కేంద్ర స్థాయి సమీక్ష

ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఆయన కూడా అహ్మదాబాద్‌ చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. అన్ని కోణాల్లో విచారణ జరిపి ఘటనకు గల కారణాలను త్వరితగతిన వెలుగులోకి తేయాలని సూచించారు.

Read Also : Boeing Shares Crash : ఫ్లైట్ ప్రమాదం.. అమెరికాలో బోయింగ్ షేర్లు భారీగా పతనం

Ahmedabad plane crash air india Google News in Telugu Rammohan Naidu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.