📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Nithin Gadkari :కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!

Author Icon By Anusha
Updated: March 16, 2025 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నేత అయిన నితిన్ గడ్కరీ దేశంలో పెరుగుతున్న కుల రాజకీయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన కులం పేరుతో రాజకీయాలు చేసే వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “కులం పేరెత్తితే కొడతాను” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

నాగ్‌పూర్‌ సభలో గడ్కరీ ఘాటు వ్యాఖ్యలు

నాగ్‌పూర్‌లో తాజాగా జరిగిన సెంట్రల్ ఇండియా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని ప్రసంగించారు. ఇందులో గడ్కరీసమానత్వం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేశారు. అలాగే దేశంలో కుల ఆధారిత రాజకీయాలను విమర్శించారు.ఒక వ్యక్తి విలువను కులం, మతం, భాష, లింగం ఆధారంగా కాకుండా వారి లక్షణాల ద్వారా నిర్ణయించాలని గడ్కరీ అన్నారు. అందుకే మనం కులం, వర్గం, మతం, భాష లేదా లింగం ఆధారంగా ఎవరిపైనా వివక్ష చూపకూడదని ఆయన తెలిపారు.కులం పేరెత్తితే కాలుతో తంతానని ఓ 50 వేల మంది పాల్గొన్న కార్యక్రమంలో తాను చెప్పినట్లు గడ్కరీ గుర్తుచేశారు.

సిద్ధాంతాలకు కట్టుబడి

తాను ఇలా మాట్లాడటం ద్వారా రాజకీయంగా ఇబ్బందుల్లో పడొచ్చని తన స్నేహితులు చెప్పారని, కానీ తాను దాని గురించి ఆందోళన చెందడం లేదని గడ్కరీ వెల్లడించారు. ఎన్నికల్లో ఓడిపోతే ఎవరూ తమ ప్రాణాలను కోల్పోరని, తాను తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని గడ్కరీ తేల్చిచెప్పేశారు. కుల ఆధారిత గుర్తింపు రాజకీయాల్లో గణనీయమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, అది తన ఓట్లు పొగొట్టినప్పటికీ తాను అలాంటి వాటికి దూరంగా ఉంటానన్నారు.

కుల రాజకీయాల వల్ల నష్టమే

గడ్కరీ ప్రకటనకు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది.భారతీయ రాజకీయాల్లో కుల వ్యవస్థ కీలకంగా మారిపోతోంది.ఎన్నికల్లో కుల ప్రాతిపదికన ఓట్లు సాధించాలనే ప్రయత్నాలు పెరుగుతున్నాయి.కానీ గడ్కరీ ఆ దారిలో వెళ్లకుండా సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

గడ్కరీ వ్యాఖ్యలపై దేశవ్యాప్త చర్చ

రాజకీయ నేతలు, సామాజిక వర్గాలు గడ్కరీ వ్యాఖ్యలపై స్పందించాయి. కొందరు “ఇది నిజమైన నాయకత్వ లక్షణం” అని ప్రశంసిస్తే, మరికొందరు “కుల రాజకీయాలు పూర్తిగా తొలగించడానికి ప్రస్తుత రాజకీయ వ్యవస్థ సిద్ధంగా లేదని” అంటున్నారు.

సమాజ సమానత్వం కోసం గడ్కరీ పోరాటం

నితిన్ గడ్కరీ కేవలం మంత్రిగా మాత్రమే కాకుండా, సమాజ సమానత్వం కోసం పోరాడే వ్యక్తిగా మరోసారి నిరూపించుకున్నారు.సమాజాన్ని కుల ప్రాతిపదికగా కాకుండా సమానత్వం ప్రాతిపదికగా నిర్మించాలి అని పిలుపునిచ్చారు.

#bjp #CastePolitics #Equality #IndianPolitics #Nagpur #NitinGadkari #NoToCasteism #PoliticalSpeech #SocialJustice Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.